కూలీ నంబర్ 1‌పై ప్రధాని మోదీ ప్రశంసలు, మీ నిర్ణయం సూపర్బ్

బాలీవుడ్ చిత్రం కూలీ నంబర్ 1 సినిమా యూనిట్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా సెట్‌లో, షూటింగ్ జరిగే ప్రాంతంలో ప్లాస్టిక్ ఉయోగించకూడదని తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌లో ప్లాస్టిక్‌ను వాడకూడదని నిర్ణయం తీసుకొన్నట్టు హీరో వరుణ్ ట్వీట్ చేశారు.

ప్లాస్టిక్ రహిత దేశంగా మారడానికి ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషి అద్భుతం. ఆ కార్యక్రమానికి మా వంతుగా మేము అండగా నిలువాలని అనుకొన్నాం. అలాగే కూలీ నంబర్ 1 షూటింగ్‌లో ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ బాటిల్స్ ఉపయోగించాలని నిర్ణయం తీసుకొన్నాం అని వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు.

Coolie No 1 on plastic-free spree: PM Narendra Modi praises

హీరో వరుణ్ ధావన్ చేసిన ట్వీట్‌కు ప్రధాని నరేంద్రమోదీ స్పందించాడు. కూలీ నంబర్ 1 టీమ్ తీసుకొన్న నిర్ణయం సూపర్బ్. దేశాన్ని ప్లాస్టిక్ కోరల్లో నుంచి విముక్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నానికి కూలీ నంబర్ 1 టీమ్ సహకరించడం ఆనందంగా ఉంది అంటూ నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

Coolie No 1 on plastic-free spree: PM Narendra Modi praises

90వ దశకంలో తెలుగులో ఘన విజయం సాధించిన కూలీ నంబర్ 1 చిత్రం ప్రస్తుతం అదే పేరుతో హిందీలో రీమేక్ అవుతున్నది. వెంకటేష్, టబు జంటగా నటించగా.. ప్రస్తుతం వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ ఆ పాత్రలో నటిస్తున్నారు.

Coolie No 1 on plastic-free spree: PM Narendra Modi praises

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X