దయచేసి రాకండి నేను మాత్రం బయటకు రాను.. ఫ్యాన్స్‌కు అమితాబ్ సూచన
ప్రపంచమంతటా కరోనా స్వైర విహారం చేస్తోంది. వేల మందిని పొట్టనబెట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఈ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దాదాపు 90 మందికి కరోనా సోకగా.. ఇద్దరు మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోనూ కరోనా వ్యాప్తిచెందగా.. జనసందోహంగా ఉండే ప్రదేశాలన్నింటిని మూసి వేయమని ప్రభుత్వం ఆదేశించింది. సెలెబ్రిటీలకు కరోనా పెద్ద తలనొప్పిని తీసుకొచ్చింది. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

బాక్సాఫీస్ విలవిల..
కరోనా దెబ్బకు సినీ పరిశ్రమకు కుదేలవుతోంది. బాక్సాఫీస్ కలెక్షన్లు లేక నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చేలా ఉంది. బాలీవుడ్‌లో భాగీ 3 చిత్రానికి ఇప్పటికే వసూళ్లు తగ్గాయి. పలు రాష్ట్రాల్లో థియేటర్లు కూడా మూసి వేశారు. దీంతో కలెక్షన్స్ లేక బాక్సాఫీస్ విలవిల్లాడుతోంది.

వాయిదా పడుతోన్న సినిమాలు..
కరోనా వైరస్‌కు భయపడి కొన్ని చిత్రాలైతే వాయిదా కూడా పడ్డాయి. ఒక వేళ రిలీజ్ చేసినా జనాలు రాక కలెక్షన్లు ఉండవని మోహన్ లాల్ వంటి హీరోనే వెనకడుగు వేశాడు. అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కిన మరక్కార్ వాయిదా పడింది. తెలుగులో నాని V చిత్రం కూడా పోస్ట్ పోన్ చేశాడు.

షెడ్యూల్స్ వాయిదా..
మరికొన్ని చిత్రాల షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్స్ అన్నీ కూడా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్-సుకుమార్, ఆచార్య, ఇలా అనేక సినిమాల షూటింగ్స్‌కు బ్రేక్ పడింది. ఇలా అనేక రకాలుగా కరోనా వైరస్ సినీ పరిశ్రమను వెంటాడుతోంది.
Recommended Video

దయచేసి రాకండి..
ప్రతీ ఆదివారం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేస్తుంటారు. అలా వచ్చిన ఫ్యాన్స్‌ను ప్రేమగా పలకరిస్తుంటాడు. అయితే ఈ ఆదివారం మాత్రం అలా రాకండి.. అందరూ జాగ్రత్తగా ఉండండి..తాను మాత్రం బయటకు రాలేనని చెప్పుకొచ్చాడు. ఇలా కరోనాకు బయపడి అమితాబ్ అభిమానులకు ఇలా సూచనలిచ్చాడు.


Click it and Unblock the Notifications











