కరోనా ఎఫెక్ట్ : సల్మాన్ ఖాన్ ఏం తింటున్నాడంటే?.. వీడియో వైరల్
ప్రపంచమంతా కరోనా ధాటికి విలవిల్లాడుతోంది. ఈ వైరస్ ధాటికి అగ్రరాజ్యంతో సహా ప్రపంచ దేశాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకింది. వేల మంది ఈ వైరస్‌కు బలయ్యారు. మన దేశంలోనూ కరోనా కోరలు చాచుతోంది. ఇప్పటికే వేల మందికి కరోనా సోకింది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు మన ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

21 రోజుల లాక్ డౌన్..
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలంతా ఇంటికి పరిమితం కావాలని.. ఎవ్వరూ కూడా రోడ్లపైకి రాకూడదని ఆదేశించిన సంగతి తెలిసిందే. రవాణా సౌకర్యాలను కూడా మూసి వేశారు. దీంతో ఎక్కడి వారు అక్కడే పరిమితమయ్యారు.

ఫామ్ హౌస్‌లో చిక్కుకున్న సల్మాన్..
లాక్ డౌన్ కారణంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ఫాం హౌస్‌కు పరిమితమయ్యాడు. షూటింగ్ నిమిత్తం ముంబై దగ్గర్లో ఉన్న తన పన్వెల్ ఫాంహౌస్‌కు వెళ్లిన సల్మాన్.. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు.
సినీ కార్మికులకు అండగా..
కరోనా లాంటి కష్టకాలంలో సినీ కార్మికులకు అండగా ఉండేందుకు సల్మాన్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 25 వేల సభ్యులున్న సినీ కార్మికుల సంస్థకు పెద్ద మొత్తంలో విరాళాన్ని ఇచ్చాడు. అందరి ఖాతాల్లోకి నేరుగా డబ్బు వెళ్తుందని ప్రకటించాడు. చెప్పినట్టుగా అందరి అకౌంట్స్‌లో మూడు వేల చొప్పున జమ చేసినట్టు తెలుస్తోంది.
Recommended Video

గుర్రంతో బ్రేక్ ఫాస్ట్..
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ నడుస్తోంది. తినడానికి తిండి దొరకని వారెందరో ఉన్నారు. మనుషుల సంగతే అలా ఉంటే మూగజీవాల గురించిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సల్మాన్ తన ఫాంహౌస్‌లో గుర్రానికి తినిపిస్తున్న ఆకులనే తింటూ బ్రేక్ ఫాస్ట్ విత్ మై లవ్ అంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











