twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ఎఫెక్ట్: ముందుకొచ్చిన షారుఖ్ ఖాన్.. ఆయన ప్రకటన చూస్తే!

    |

    కరోనా కబళిస్తోంది. కరోనా దెబ్బకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతమవుతున్నాయి. ప్రజా జీవనం స్తంభించిపోయింది. లాక్ డౌన్ విధించడంతో రోజు వారి కూలీలకు పనులు దొరకక హృదయ విషాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేపడుతున్న సహాయక కార్యక్రమాలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు. తాజాగా షారుఖ్ ఖాన్ ముందుకొచ్చారు. వివరాల్లోకి పోతే..

    దేశ వ్యాప్త లాక్‌డౌన్.. కరోనాపై పోరాటం

    దేశ వ్యాప్త లాక్‌డౌన్.. కరోనాపై పోరాటం

    దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ అమలులో ఉంది. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి నిర్విరామంగా శ్రమిస్తున్నారు.

    ప్రధాని పిలుపు.. రంగంలోకి అక్షయ్ కుమార్

    ప్రధాని పిలుపు.. రంగంలోకి అక్షయ్ కుమార్

    ఈ నేపథ్యంలో కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ఆర్థిక సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ప్రధాని ప్రకటన చూడగానే హీరో అక్షయ్ కుమార్ రంగంలోకి దిగి.. ఇంత వరకు ఏ సెలెబ్రిటీ ఇవ్వనంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించడం అందరికీ తెలిసిందే. పీఎం కేర్ అంటూ విరాళాలు అర్థించగా.. రూ. 25 కోట్ల భారీ మొత్తాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు అక్షయ్.

     భారీ స్థాయిలో వితరణ.. అది మాత్రం లెక్కతేలలేదు

    భారీ స్థాయిలో వితరణ.. అది మాత్రం లెక్కతేలలేదు

    ఇక తాజాగా మరో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పీఎం కేర్స్ ఫండ్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో వితరణ ప్రకటించారు. అయితే ఆ మొత్తం ఎంతన్నది మాత్రం తెలియరాలేదు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, మీర్ ఫౌండేషన్, రెడ్ చిల్లీస్ వీఎఫ్‌ఎక్స్ సంస్థలతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరుపున పలు సహాయక కార్యక్రమాలు చేస్తామని తెలిపారు షారుఖ్.

     డాక్టర్ల కోసం ప్రత్యేకంగా..

    డాక్టర్ల కోసం ప్రత్యేకంగా..

    ఇందులో భాగంగా ముంబై, కోల్‌కతా, దిల్లీ నాగరాల్లోకి పేద ప్రజలకు తన సంస్థ ద్వారా నిత్యావసరాలు సరఫరా చేస్తామని చెప్పారు షారుఖ్ ఖాన్. అదేవిధంగా కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్ల కోసం 50 వేల శరీర రక్షక వ్యవస్థలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేగాక, నిత్యం హాస్పిటళ్లు, ఇతర ప్రాంతాల్లో 2 వేల మందికి సరిపడా ఆహారాన్ని అందించే వంటగదిని ఏర్పాటు చేస్తామని అన్నారు.

    Recommended Video

    Akshay Kumar Donates Rs 25 Cr To PM Narendra Modi's Cares Fund
    విపత్కర పరిస్థితుల్లో అందరం కలసికట్టుగా..

    విపత్కర పరిస్థితుల్లో అందరం కలసికట్టుగా..

    కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్థవ్ థాక్రే, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తోన్న కృషిని షారుఖ్ కొనియాడారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో అందరం కలసికట్టుగా కరోనాపై పోరాటం చేయాలని ఆయన పేర్కొన్నారు.

    English summary
    Akshay Kumar donates 25 crores to PM CARES Fund for Corona survive. Now Shahrukh Khan also says his donation details on Corona survive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X