ఎటు చూసినా ఎడారే, నరకం లాంటి అనుభవం: ఫారిన్‌లో కరోనా భయంతో గాయని

బాలీవుడ్ సింగర్ నీతి మోహన్ విహారయాత్ర కరోనావైరస్ కారణంగా భయంకరమైన అనుభవంగా మిగిలింది. కరోనావైరస్ ముప్పు బయటకు రావడానికి కొద్ది రోజుల ముందు తన భర్త, తన చెల్లెల్లతో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. అయితే కరోనా వ్యాప్తి విజృంభిస్తున్నదనే వార్తలతో విహారయాత్రను ముగించుకొని మధ్యలోనే భారత్‌కు వచ్చారు. ఈక్రమంలో ఆమెకు ఎదురైన భయంకరమైన అనుభవాలను మీడియాతో పంచుకొన్నారు.

కరోనావైరస్ వార్తలతో భయంతో

కరోనావైరస్ వార్తలతో భయంతో


ఆస్ట్రేలియాలో మా విహారయాత్ర ఆనందంగా సాగుతున్నది. ఆ సమయంలోనే కరోనావైరస్ వార్తలు, వ్యాధిగ్రస్తుల గుర్తింపు సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ సమయంలోనే ఆస్ట్రేలియాలో షూటింగ్ చేస్తున్న హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ దంపతులు కరోనావైరస్ బారిన పడ్డారనే వార్తలతో ఆందోళన మొదలైంది అని నీతి మోహన్ పేర్కొన్నారు.

అర్ధాంతరంగా ఇండియాకు

అర్ధాంతరంగా ఇండియాకు

ఆస్ట్రేలియాలో పరిస్థితులు దారుణంగా మారుతుంటే వెంటనే ఇండియాకు వెళ్లాలనే నిర్ణయం తీసుకొన్నాం. ఇక అక్కడే ఉంటే కరోనా బారిన పడే అవకాశం ఉందనే భయం మొదలైంది. నా తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో స్వదేశానికి తిరుగుముఖం పట్టాం అని నీతిమోహన్ తెలిపారు.

ప్రయాణంలో నరకంగా

ప్రయాణంలో నరకంగా

వాస్తవానికి మార్చి 17వ తేదీన భారత్‌కు రావాల్సి ఉంటే.. పర్యటను అర్ధాంతరంగా వాయిదా వేసుకొని మార్చి 12నే ఇండియాకు వచ్చేశాం. ఇక ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చే క్రమంలో నరకాన్ని అనుభవించాం. మేము సింగపూర్ నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు వచ్చాం. మా తిరుగు ప్రయాణం జీవితంలోనే అత్యంత దారుణం అని నీతి మోహన్ చెప్పారు.

ఎయిర్‌పోర్టులన్నీ ఎడారులుగా

ఎయిర్‌పోర్టులన్నీ ఎడారులుగా

సింగపూర్, దుబాయ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎయిర్‌పోర్టులన్నీ ఎడారులుగా మారాయి. ఎటూ చూసినా చాలా ఖాళీగా ఉన్నాయి. ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ త్వరగా ముగిసిపోయింది. ఎప్పుడూ కిటకిటలాడే ప్రదేశాలు బోసిపోయి ఉన్నాయి. అలాంటి పరిస్తితి చూస్తే మా ప్రాణాలకు ముప్పు తప్పదేమో అనే ఫీలింగ్ కలిగింది అని నీతి మోహన్ చెప్పింది.

Recommended Video

Mega Star Chiranjeevi Swag All Over Twitter
స్వీయ గృహ నిర్భంధంలో

స్వీయ గృహ నిర్భంధంలో


ఇండియాకు వచ్చిన వెంటనే పుణేలోని తమ ఫామ్ హౌస్‌లో స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లాను. ఆ తర్వాత కేంద్ర లాక్‌డౌన్ ప్రకటించింది. తాము పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకొని రావడం మంచి పని అనే ఫీలింగ్ కలిగింది. ఏప్రిల్ 14 వరకు మేము పుణెలో ఉండాలని నిర్ణయించుకొన్నాం అని నీతి మోహన్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X