యువ హీరోయిన్ అపార్ట్‌మెంట్‌లో కరోనావైరస్.. పరిస్థితి ఎంత డేంజరంటే..

ప్రస్తుత రోజుల్లో కరోనావైరస్ పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. అదే పొరుగింవటిలోనో, లేదా అదే వీధిలో కరోనావైరస్ ఉందంటే ఇక పరిస్థితి మాటల్లో చెప్పనక్కర్లేదు. ఇక మనం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనో.. పక్క ఫ్లాట్‌లోనూ కరోనావైరస్ సోకిన వ్యక్తి ఉన్నారంటే ఎవరైనా హడలెత్తడం ఖాయమే. తాజాగా ఇలాంటి పరిస్థితే యువ హీరోయిన్‌కు ఎదురైంది. దాంతో భయాందోళనకు గురైన ఆ కుర్ర హీరోయిన్ అపార్ట్‌మెంట్‌లో ఏం జరిగిందంటే..

అంకితా లోఖండే అపార్ట్‌మెంట్‌లో

అంకితా లోఖండే అపార్ట్‌మెంట్‌లో

బాలీవుడ్‌లోనూ, టెలివిజన్ రంగంలోనూ ఇప్పుడిప్పుడే అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న అంకితా లోఖాండే ముంబైలోని విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఆపార్ట్‌మెంట్‌లో కట్టుదిట్టమైన భద్రతలు ఉన్నాయి. అయితే అత్యంత సెక్యూరిటీ ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి కరోనావైరస్ సోకిన వ్యక్తి రావడంతో అందులో ఉండేవారంతా భయాందోళనకు లోనయ్యారు.

Recommended Video

Prabhas - The Charity King In Tollywood | Filmibeat Telugu
స్పెయిన్‌ నుంచి వచ్చి..

స్పెయిన్‌ నుంచి వచ్చి..

ఇటీవల అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ వ్యక్తి స్పెయిన్ నుంచి ముంబైకి వచ్చారు. ఎయిర్‌పోర్టులో నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చినా.. ఆ తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దాంతో ఆ వ్యక్తితోపాటు ఆయన భార్యను కూడా గృహ నిర్బంధంలో పెట్టారు. వారిని బయటకు రాకుండా.. బయటి వారిని అపార్ట్‌మెంట్‌లోకి రాకుండా చర్యలు తీసుకొన్నారు.

రెండు వారాలుగా

రెండు వారాలుగా

గత 12 రోజులుగా అపార్ట్‌మెంట్లోని ఓ విభాగాన్ని పూర్తిగా మూసివేశారు. ఆ విభాగానికి రాకపోకలు లేకుండా తలుపులు బిగించి తాళాలు వేశారు. బయట వ్యక్తులను లోనికి రాకుండా.. లోనివారిని బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్తానిక పోలీసులు హెచ్చరించారు.గత రెండు వారాలుగా పరిస్థితిలో మార్పులేమి కనిపించకపోవడంతో బాధితుడిని హాస్పిటల్‌కు తరలించారు.

క్వారంటైన్ ఫెసిలిటీలోకి

క్వారంటైన్ ఫెసిలిటీలోకి

అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మోడల్ అషితా మాట్లాడుతూ.. మా అపార్ట్‌మెంట్‌లో మా వింగ్‌లోనే ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందనేది నిజమే. ప్రస్తుతం అతడిని క్వారంటైన్ ఫెసిలిటీకి తరలించారు. అయినా పరిస్థితుల కష్టంగానే ఉన్నాయి. ఎవరికి వారు తమ సెఫ్టీ గురించి చర్యలు తీసుకొంటున్నారు బయట వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X