హిందీ అర్జున్ రెడ్డి షూటింగ్‌లో విషాదం.. కప్పిపుచ్చే ప్రయత్నం.. పోలీసులు క్లారిటీ!
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం ప్రస్తుతం హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ అవుతున్నది. ఈ చిత్రంలో షాహీద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రలో, కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ముస్సోరిలో నిర్విరామంగా జరుగుతున్నది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో విషాదం చోటుచేసుకోవడం సినిమా యూనిట్ సభ్యులను కలిచివేసింది. షూటింగ్‌లో జరిగిన విషాదం ఏమిటంటే..

ముస్సోరి షూటింగ్‌లో ప్రమాదం
ముస్సోరిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో కబీర్ సింగ్ చిత్ర షూటింగ్ జరుగుతున్నది. ఈ షూటింగ్‌లో జనరేటర్ ఆపరేటర్ మృతి చెందాడు. షూటింగ్ సమయంలో జనరేటర్ ఫ్యాన్‌లో అతడి మఫ్లర్ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్టు చెప్పారు. ఫ్యాన్‌లో మఫ్లర్ చిక్కుకోవడం మరణానికి కారణమైంది అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

యూనిట్ సిబ్బంది మృతి
కబీర్ ఖాన్ షూటింగ్‌లో రాము అనే జనరేటర్ ఆపరేటర్ మరణించాడు. జనరేటర్ ఫ్యాన్‌లో అతడి మఫ్లర్ పడటంతో గాయాల పాలయ్యారు. అతడిని డెహ్రాడూన్ అని మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు అని స్థానిక పోలీసులు మీడియాకు వెల్లడించారు.

హోటల్ యాజమాన్యం భిన్న వాదన
అయితే షూటింగ్‌లో జనరేటర్ సిబ్బంది మృతి చెందడాన్ని ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బంది కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. అలాంటి ఘటన ఏదీ జరుగలేదని బుకాయించింది. ముజఫర్ నగర్‌కు చెందిన రాము డెహ్రాడూన్‌లోని ఓ జనరేటర్ కంపెనీలో గత కొద్దికాలంగా పనిచేస్తున్నట్టు తెలిసింది.

అండగా ఉంటామని
కబీర్ సింగ్ సినిమా షూటింగ్‌లో జరిగిన దుర్ఘటనపై సినీ వన్ స్టూడియోస్, టీ సీరిస్ ఫిల్మ్స్ స్పందించింది. షూటింగ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. అతని కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం. అతడి కుటుంబానికి అండగా ఉంటాం అని నిర్మాతలు ఓ ప్రకటనలో తెలిపారు.

జూన్ 21 తేదీన రిలీజ్
కబీర్ సింగ్ సినిమా 2019 జూన్ 21వ తేదీన రిలీజ్ కానున్నది. తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రను షాహీద్ కపూర్, షాలినీ పాండే పాత్రలో కియారా అద్వానీ నటించారు. సినీ వన్ స్టూడియోస్, టీ సీరిస్ ఫిల్మ్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











