Parineeti Chopra Wedding పెళ్లిసందడికి ముందు క్రికెట్ మ్యాచ్.. వివాహ వేడుకలో ఏం వడ్డిస్తున్నారంటే?
పార్లమెంట్ సభ్యుడు రాఘవ చద్దా, బాలీవుడ్ నటి పరిణితి చోప్రా డేటింగ్ వ్యవహారానికి, వారి మధ్య అఫైర్ గాసిప్స్‌కు శాశ్వతంగా తెరపడపోతున్నది. గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్న వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో పరిణితి, రాఘవ పెళ్లికి అంగరంగవైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఆప్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా పెళ్లికి సంబంధించిన వేదికకు రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు.ఉదయ్‌పూర్‌లోని ఒకటి ది లీలా ప్యాలెస్, రెండోది ది తాజ్ లేక్ ప్యాలెస్‌లో వివాహ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి రాజకీయ, సినీ వర్గాలు, స్నేహితులు, సన్నిహితులు హాజరు కానున్నారు.

పరిణితి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి ముందు ఇరు కుటుంబాల మధ్య క్రికెట్ మ్యాచ్ ఢిల్లీలో ఆడనున్నారు. ఈ మేరకు రెండు ఫ్యామిలీ నుంచి రెండు జట్లను ఎంపిక చేశారు. ఫ్లెండ్లీ మ్యాచ్‌గా జరిగే ఈ పోటీని ఛాలెంజ్‌గా తీసుకొనేలా కనిపిస్తున్నది. పరణితి తరఫు జట్టు గెలుస్తుందా? రాఘవ చద్దా తరఫు జట్టు గెలుస్తుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్ అనంతరం ఇరు కుటుంబాలు ఉదయ్‌పూర్‌కు చేరుకొంటారు. ఆ తర్వాత పరిణితికి సంబంధించిన చూరా వేడుకను నిర్వహిస్తారు. ఆ రోజు 90వ దశకంలో ఆచరించే వివాహ సంప్రదాయాలతో ఓ థీమ్ లంచ్‌ను సెప్టెంబర్ 24వ తేదీన ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజు రాయల్ ఫ్యామిలీ సంప్రదాయాల ప్రకారం.. రాఘవ్ చద్దాకు షేరా బందీ వేడుక జరుగుతుంది.
సెప్టెంబర్ 24వ తేదీన రాఘవ చద్దా, పరిణితి వివాహం తాజ్ లేక్ ప్రాంతంలో జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు వివాహ కార్యక్రమం మొదలువుతుంది. 2 గంటల ప్రాంతంలో పెళ్లి బరాత్ జరుగుతుంది. 3.30 గంటలకు జైమాలా వేడుకతో పెళ్లి తంతు పూర్తి అవుతుంది.
పరిణితి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లిలో నోరూరించే వంటకాలు వడ్డించనున్నారు. సంప్రదాయ పంజాబీ వంటకాలతోపాటు రాజస్థానీ రాజరికం పద్దతిలో వంటలు కూడా తయారు చేస్తున్నారు. ఇంకా వెస్ట్రన్, చైనీస్, కాంటినెంటల్ ఫుడ్‌ను కూడా మెనులో చేర్చారు.


Click it and Unblock the Notifications











