Don't Miss!
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యువ హీరోయిన్‌తో కేఎల్ రాహుల్ డేటింగ్ బట్టబయలు.. రొమాన్స్ మామూలేగా లేదే.. మీడియా కంటికి అలా!
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి కొద్దికాలంగా క్రికెటర్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వారిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని ముంబై వీధుల్లో, హోటల్లో మీడియా కంటికి చిక్కడంతో ఆ రూమర్లకు సంబంధించిన వార్తలకు బలం చేకూరాయి. అయితే తాజాగా అతియా శెట్టి తన ప్రియుడు, క్రికెటర్‌తో బర్త్ డేను జరుపుకోవడంతో వారిద్దరి డేటింగ్ క్లారిటీ వచ్చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ హీరో కూతురుగా ఎంట్రీ
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తెగా అతియా శెట్టి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగమ్మ గత ఐదేళ్లలో కేవలం నాలుగు సినిమాల్లోనే కనిపించారు. ముబాకరన్, నవాబ్జాదే, మోతీ చూర్ చకన్నచూర్ అనే సినిమాల్లో నటించినప్పటికీ సరైన హిట్టును ఖాతాలో వేసుకోకపోవడం గమనార్హం.
కొద్దికాలంగా కేఎల్ రాహుల్‌తో ప్రేమలో
అయితే కెరీర్‌పైనే దృష్టిపెడుతూనే క్రికెటర్ రాహుల్‌తో సన్నిహితంగా ఉంటూ కనిపించారు. రెస్టారెంట్లు, కాఫీ షాపులు, హోటల్స్ అనే తేడా లేకుండా స్నేహితులుతో కలిసి గత రెండేళ్లుగా వారిద్దరూ హల్చల్ చేస్తున్నారు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకొంటూ తమ అఫైర్ గురించిన విషయాలపై హింట్స్ ఇస్తున్నారు.
కేఎల్ రాహుల్ పుట్టిన రోజున
క్రికెటర్ కేఎల్ రాహుల్ తన పుట్టిన రోజును అతియా శెట్టితో స్పెషల్‌గా జరుపుకొన్నారు. ఆ సమయంలో వారిద్దరూ తమ సెల్ఫీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కేఎల్ రాహుల్ గురించి చెబుతూ.. అతడు నా మనిషి.. నాకే సొంతమైన వ్యక్తికి హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ అందజేశారు. దాంతో వారిద్దరి బంధంపై క్లారిటీ వచ్చేసింది.
అతియా బర్త్ డే రోజున రాహుల్ స్పెషల్ విషెస్
ఇక ఇటీవల.. కొద్ది రోజుల క్రితం అతియా శెట్టి తన 28వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నది. తన బర్త్ డే రోజున బాయ్‌ఫ్రెండ్ కేఎల్ రాహుల్ నుంచి స్పెషల్ మెసేజ్ అందుకొన్నది. దాంతో ఆమె బర్త్ డే మరింత ప్రత్యేకంగా మారింది. రాహుల్ భుజంపై తలవాల్చిన అతియా తన ప్రేమలో మునిగిపోయినట్టు కనిపించింది. హ్యాపీ బర్త్ డే.. మై మ్యాడ్ చైల్డ్ (పిచ్చి పిల్లకు నా జన్మదిన శుభాకాంక్షలు అంటూ) విషెస్ అందజేశారు.