Raj Kundra కేసులో మరో నటికి సమన్లు.. చిక్కులు తప్పేట్టులేదు?
రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాల కేసు ప్రతిసారి కొత్త మలుపులు తిరుగుతోంది. అశ్లీల చలనచిత్రాలను నిర్మించినందుకు శిల్పా శెట్టి భర్త జూలై 19 న అరెస్టు అయినప్పటి నుండి, అతని భార్య మరియు గెహానా వశిష్ట్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు మద్దతుగా ఆ యాప్‌లోని కంటెంట్ పోర్న్ కాదని కేవలం శృంగార కంటెంట్ అని చెబుతున్నారు. అయితే, పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా వంటి కొందరు ప్రముఖులు తమను ఈ చీకటి వ్యాపారంలోకి నెట్టివేస్తున్నారని పేర్కొన్నారు. అశ్లీల సినిమాలు నిర్మించారనే ఆరోపణతో ఈ ఏడాది ఆరంభంలో అరెస్టయిన గెహానా వశిష్ట్, పూనమ్ మరియు షెర్లిన్ ఇద్దరూ 'అబద్ధాలు' చెబుతున్నారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇక ఆదివారం నాడు ఈ కేసులో నటి గెహానా మరియు మరో ఇద్దరిని ప్రశ్నించడానికి పిలిచిన క్రైం బ్రాంచ్ ఇప్పుడు షెర్లిన్ చోప్రాను కూడా పిలిచినట్లు సమాచారం. బాలీవుడ్ మీడియా కధనాల ప్రకారం, రాజ్ కుంద్రా అరెస్ట్ కేసులో ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ కూడా షెర్లిన్ చోప్రాను విచారిస్తుందని, ఈ విషయంలో నటికి సమన్లు పంపబడ్డాయని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి రేపు (జూలై 27) ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని, తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ నటిని కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే చిక్కుల్లో ఉన్న రాజ్ కుంద్రాకు షెర్లిన్ మరింత చిక్కుల్లో నెట్టే అవకాశం కనిపిస్తోంది. రాజ్ కుంద్రా మరియు పోర్న్ వీడియోల గురించి బహిరంగంగా మాట్లాడుతున్న షెర్లిన్ చోప్రా ఇటీవల ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

అందులో మహారాష్ట్ర సైబర్ సెల్ కు ఈ విషయంపై స్టేట్‌మెంట్ ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనని ఆమె వెల్లడించారు. ముంబై పోలీసులు అశ్లీలతకు సంబంధించి 2021 ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారని తెలిసిన విషయమే. ఈ సందర్భంలో, షెర్లిన్ చోప్రా మరియు పూనమ్ పాండే ఇచ్చిన స్టేట్మెంట్ లను మహారాష్ట్ర సైబర్ సెల్‌లో ఇప్పటికే రికార్డ్ చేశారు. రాజ్ కుంద్రాపై షెర్లిన్ చోప్రా ఆరోపణలు చేశారని, తనను ఈ అడల్ట్ పిక్చర్ పరిశ్రమలోకి తీసుకువచ్చింది రాజ్ కుంద్రా అని ఆమె పేర్కొన్నారు. నివేదికల ప్రకారం, రాజ్ కుంద్రా కూడా షెర్లిన్ చోప్రాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.


Click it and Unblock the Notifications











