శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా ఇంటిపై ఫోకస్ పెట్టిన క్రైమ్ బ్రాంచ్.. ఆ సీక్రెట్స్ లాగేందుకు మరిన్ని సోదాలు!
అశ్లీల చిత్రాలను రూపొందించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ కుంద్రాను జూలై 19 న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్తనే అలాంటి సినిమాలు తీస్తున్నట్లు తెలియగానే ఈ కేసు నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఇక కేసు మరింత సిరియాస్ గా మారుతోంది. అధికారులు ఏ మాత్రం పట్టు విడువడం లేదు. ఇక ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం మరోసారి శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా నివాసానికి చేరుకున్నట్లు సమాచారం.

శిల్పా శెట్టి , రాజ్ కుంద్రా నివాసంలో సోదాలు
అనుమానం ఉన్న స్టార్స్ ను కూడా ఏ మాత్రం వడలకుడదని ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కొద్దీ సేపటి క్రితమే ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం ముంబైలోని జుహు ప్రాంతంలోని శిల్పా శెట్టి , రాజ్ కుంద్రా నివాసానికి చేరుకుంది. వారి ఇంట్లో మళ్ళీ కొత్తగా మొదటి నుంచి సోదాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

జూలై 27 వరకు కస్టడీలోనే
అశ్లీల చిత్రాలను రూపొందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జూలై 19న అరెస్టు చేయగా అనంతరం జూలై 27 వరకు పోలీసు కస్టడీని పొడగించారు. ఇక రాజ్ కుంద్రా ఇంట్లో అలాగే అతని సన్నిహితుల ఇంట్లో కూడా మరికొన్ని రోజుల వరకు సోదాలు చేసే అవకాశం ఉంది.

కేసు విషయంలో మరింత దర్యాప్తు
రాజ్ కుంద్రా బిజినెస్ అసోసియేట్ ర్యాన్ తోర్పేను శుక్రవారం మూడు రోజుల పోలీసు రిమాండ్ ముగింపులో మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరుపరిచారు. కేసు విషయంలో మరింత దర్యాప్తు చేయడానికి పోలీసులు తమ కస్టడీని పొడిగించాలని కోరగా అందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అది పూర్తిగా చట్టవిరుద్ధమని
రాజ్ కుంద్రా అలాగే అతని టీమ్ సభ్యులు అశ్లీల సినిమాలను రూపొందించి వాటిని యాప్స్ ద్వారా బిజినెస్ చేసుకుంటున్నారని అది పూర్తిగా చట్టవిరుద్ధమని గతంలో పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇక రాజ్ కుంద్రా యొక్క మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఆఫీసర్లు దాని విషయాలను పరిశీలించాల్సిన అవసరం కూడా ఉందని, అతని వ్యాపార వ్యవహారాలను లావాదేవీలను కూడా పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.
Recommended Video


2019లోనే కేసు పెట్టిన పూనమ్ పాండే
ఇదిలావుండగా 2019 లోనే కుంద్రాపై నటి-మోడల్ పూనమ్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది. హాట్‌షాట్స్ యాప్ కోసం రాజ్ కుంద్రా తనను సంప్రదించినట్లు ఆరోపించారు. ఆమె తన ప్రతిపాదనను తిరస్కరించినప్పుడు, కుంద్రా అభ్యంతరకరమైన సందేశాలతో తన నంబర్‌ను లీక్ చేశాడని, బ్లాక్ మెయిల్ కూడా చేసినట్లు ఆమె ఆరోపించింది.


Click it and Unblock the Notifications











