బాలీవుడ్ యువతార ఆత్మహత్య.. మరణానికి ముందు ఇన్స్‌టాగ్రామ్‌లో..
బాలీవుడ్,, జాతీయ టెలివిజన్ రంగంలో మరో విషాదం చోటు చేసుకొన్నది. పలు ప్రజాదరణ కలిగిన టెలివిజన్ కార్యక్రమాలకు యాంకర్‌గా, హోస్ట్‌గా రాణిస్తున్న ప్రేక్ష మోహతా దారుణానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోవడం హిందీ వినోద రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ప్రేక్ష మెహతా సూసైడ్‌కు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మరణానికి ముందు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనం రేపింది. ప్రేక్ష మృతితో దిగ్బ్రాంతికి గురైన ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని సంతాపం తెలిపారు.

వర్థమాన తారగా ప్రేక్ష మెహతా
ప్రేక్ష మెహతా కెరీర్ విషయానికి వస్తే.. అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్ మ్యాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అంతకు ముందు క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరి దుర్గా లాంటి షోలకు హోస్ట్‌గా, యాంకర్‌గా పనిచేశారు. ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకొంటున్న ప్రేక్ష మెహతా అనూహ్యంగా ఇండోర్ పట్టణంలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి
కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉన్న ప్రేక్ష మెహతా సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొన్నారు. మంగళవారం తెల్లవారుజామున మాత్రమే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. నిద్ర నుంచి ఇంకా లేవలేదని తండ్రి తలుపు తట్టగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొన్న దృశ్యం కనిపించింది. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు
ప్రేక్ష తన మరణానికి ముందు ఇన్స్‌టాగ్రామ్‌లో భావోద్వేగమైన మెసేజ్‌ను పోస్టు చేశారు. ఎప్పుడైతే నీ కలలు అంతమవుతాయో.. అంతకంటే జీవితంలో చెడు దినం ఉండదు అంటూ తనలోని బాధను సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతేకాకుండా తన ఇన్స్‌టాగ్రామ్‌లో చివరి సెల్ఫీని పెట్టి.. అగర్ తుమ్ సాత్ హో అనే పాటను కోట్ చేశారు. ఆమె మరణ వార్త తెలియగానే ఇన్స్‌టాగ్రామ్‌లో ఆత్మకు శాంతి కలుగాలి అంటూ మెసేజ్‌లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి.

లాక్‌డౌన్‌తో తీవ్ర మానసిక క్షోభ
ప్రేక్ష మెహతా కెరీర్ కోసం రెండేళ్ల క్రితం ముంబైలో కాలుపెట్టారు. తాజాగా విధించిన కరోనావైరస్ లాక్‌డౌన్ ప్రభావం ఆమెపై తీవ్రంగా చూపింది. లాక్‌డౌన్ ముగిసినా గానీ పని దొరకకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఆ మానసిక క్షోభతోనే ఆమె మరణించారు అని సన్నిహితులు పేర్కొన్నారు.
Recommended Video

ఆర్థిక సమస్యలకు కారణమవుతున్న కరోనా పరిస్థితులు
కరోనావైరస్ లాక్ డౌన్ తర్వాత నెలకొన్న దుర్బర పరిస్థితులు టీవీ, సినీ నటులను వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన్మీత్ గ్రేవాల్ ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకొన్నారు. ఆ తర్వాత అలాంటి మరణాలే కొన్ని సంభవించాయి. పలువురు టెక్నిషియన్లు, యాక్టర్లు తమ భవిష్యత్‌పై బెంగపెట్టుకొని తీవ్రమైన నిర్ణయాలను తీసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.


Click it and Unblock the Notifications











