twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘విజయాలపై బీజేపీ నమ్మకం కోల్పోయింది.. ప్రభుత్వాలను కూల్చడమే వారి పని‘

    |

    మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ప్రభుత్వంపై శివసేన నాయకుడు, మంత్రి ఏకనాథ్ షిండే తిరుగుబాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఏక్‌నాథ్ షిండే అసోంలోని గౌహతికి చేరుకోవడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దాంతో మహా వికాస్ అగాధీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అయితే ఈ పరిణామాలపై నటుడు, సినీ విమర్శకుడు, నటుడు కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే ఘాటుగా స్పందించాడు. బీజేపీపై ఆయన వరుస ట్వీట్లతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ..

    కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?

    కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?


    తన మద్దతుదారులను తీసుకొని ఏక్‌నాథ్ షిండే గౌహతికి చేరుకొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆయన శివసేనకు తిరిగి వచ్చే ప్రసక్తి కనిపించడం లేదు. ప్రస్తుతం మహా వికాస్ అగాధీ పారట్ీ కష్టాల్లో పడింది. ఇక కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త ప్రభుత్వం స్థిరమైన పాలనను అందించగలదా అనే ప్రశ్నలు లేస్తున్నాయి అంటూ కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే ట్వీట్ చేశాడు.

    100 కోట్లు తీసుకొని..

    100 కోట్లు తీసుకొని..


    కమల్ ఆర్ ఖాన్ మరో ట్వీట్ చేస్తూ.. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో కొత్త రకం రాజకీయాలు మొదలయ్యాయి. ఒక పార్టీ నుంచి గెలిచి.. 100 కోట్లు తీసుకొని మరో పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. అలాంటి వాళ్లకు ఇంకా ఓట్లు వేసే ప్రజలు ఫూల్స్ అంటూ కేఆర్కే ట్వీట్‌లో పేర్కొన్నాడు.

    బీజేపీ నమ్మకం కోల్పోతుందంటూ

    బీజేపీ నమ్మకం కోల్పోతుందంటూ

    ప్రభుత్వాలను సంక్షోభాల్లోకి నెడుతున్న బీజేపీపై కమల్ ఆర్ ఖాన్ ఆగ్రహం ప్రదర్శించారు. ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకాన్ని బీజేపీ కోల్పోయింది. ప్రభుత్వాలను కూలదోయడంపైనే బీజేపీ నమ్మకం పెట్టుకొన్నది అంటూ కేఆర్కే విమర్శలు సంధించారు.

    ఓటరుకు ఆ అవకాశం ఇవ్వాలి అంటూ

    ఓటరుకు ఆ అవకాశం ఇవ్వాలి అంటూ


    అయితే ప్రస్తుత రాజకీయాలపై కేఆర్కే సెటైర్లు వేశాడు. ఓ రాజకీయ నేత పార్టీ మారడానికి అవకాశం ఉన్నప్పుడు.. ఓటరు తన ఓటును మార్చుకొనే అవకాశం ఉండాలి అంటూ కొత్త ప్రశ్నను కేఆర్కే ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఏక్‌నాథ్ షిండే, బీజేపీపై ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

    కమల్ ఆర్ ఖాన్ ఎవరంటే?

    కమల్ ఆర్ ఖాన్ ఎవరంటే?

    కమల్ ఆర్ ఖాన్ విషయానికి వస్తే.. ఆయన సినీ జర్నలిస్టుగా, సినీ విమర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. సీతమం, మున్నా పాండే బేరోజ్‌ఘార్, దేశ్‌ద్రోహి, ఏక్ విలన్ చిత్రాల్లో నటించాడు. బిగ్‌బాస్ 3 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. తుమ్ మేరీ హో, ప్యార్ కా నామ్ ఖుదా రఖా హై అనే మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించారు.

    English summary
    Critic KRK criticise BJP political strategy amid Eknath Shinde rebellion thrown Maha Vikas Aghadi Govt into Crisis. He tweeted that BJP doesn’t believe in winning elections. BJP believes in topple the government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X