Akshay Kumar స్టార్ హీరోపై చెప్పులు విసిరేసిన జనం.. పోలీసులు లాఠీ ఛార్జీ!
తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్‌కు వచ్చిన స్టార్ హీరోకు చేదు అనుభవం ఎదురైంది. అతడిపై జనాలు చెప్పులు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కూడా పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
యాక్షన్ ప్రియులకు మరికొన్ని రోజుల్లో మంచి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం బడేమియా ఛోటేమియా. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వాసు భగ్నాని నిర్మిస్తున్నారు. ఏఏజెడ్ ఫిల్మ్స్‌తో కలిసి పూజా ఎంటర్టైన్మెంట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంకా ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 10న విడుదల కానుందీ చిత్రం.

భారీగా అభిమానులు, జనాలు:విడుదల తేదీ దగ్గరపడడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచింది మూవీటీమ్. ఇందులో భాగంగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తాజాగా లఖ్‌నవూలో ప్రమోషనల్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేశారు. ఓల్డ్ లఖ్‌నవూలోని చారిత్రాత్మక ఘంటాగర్ చౌక్ వద్ద దీన్ని నిర్వహించారు. అయితే ఈ స్టార్ హీరోలను చూసేందుకు అభిమానులు, జనాలు భారీగా తరలివచ్చారు.
హీరోపై చెప్పులు:అలా ఊహించని రీతిలో పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది ఆకతాయిలు హీరో అక్షయ్ కుమార్‌పై చెప్పులు విసిరారు. అక్షయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అసభ్యకరమైన పదజాలం కూడా వాడారు. దీంతో పోలీసులకు పరిస్థితిని కంట్రోల్ చేయడం సవాల్‌గా మారింది. ఒకదశలో వారిపై అధికారులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు. దీంతో కాసేపు కార్యక్రమం కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

గతంలోనూ కూడా ఇలానే: కాగా, బాలీవుడ్ కిలాడి హీరో అక్షయ్ కుమార్‌కు ఇలా జరగడం తొలిసారేమి కాదు. గతంలోనూ ఆయనకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పృథ్వీరాజ్ సినిమా సమయంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆయనకు వ్యతిరేకంగా చంఢీగఢ్‌లో ఆందోళనలు చేపట్టారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
చాందిని చౌక్ నుంచి పోటీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ కూడా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్లీ చాందిని చౌక్ నుంచి అక్షయ్‌ను బరిలోకి దించాలని భాజాపా భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Click it and Unblock the Notifications











