లాక్‌డౌన్‌లో సల్మాన్‌కు తీరని కష్టాలు.. పన్వేల్ ఫామ్‌హౌజ్‌లో..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు లాక్‌డౌన్ కాలం కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు. కరోనా విజృంభిస్తున్న సమయంలోనే తనకు ఇష్టమైన మేనల్లుడు మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. అలా కొందరు సన్నిహితులు కూడా ఆ లోకాన్ని విడిచి వెళ్లడంతో మరింత మనస్తాపానికి గురయ్యారు. అయితే ముంబైకి సమీపంలోని పాన్వెల్ ఫామ్ హౌస్‌లో ఉంటున్న సల్మాన్ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే..

లాక్‌డౌన్‌లో సల్మాన్‌తో జాక్వలైన్
లాక్‌డౌన్ కంటే ముందు తన సోదరి అర్పితా ఖాన్ కొడుకు పుట్టిన రోజు వేడుకల కోసం సల్మాన్ తన మిత్ర బృందం జాక్వలైన్ ఫెర్నాండేజ్, లూలియా వాంటర్‌తో కలిసి పన్వేల్ ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. ఆ సమయంలోనే లాక్‌డౌన్ విధించడంతో వారంతా అక్కడే ఉన్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి జాక్వలైన్‌తో కలిసి ఓ వీడియో ఆల్బమ్‌ను, అలాగే రంజాన్ సందర్భంగా ఈద్ పాటను చిత్రీకరించి విడుదల చేశారు.

ఫామ్‌హౌజ్‌లో ఉండగానే మేనల్లుడు మరణం
లాక్‌డౌన్ సమయంలోనే సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా గుండెపోటుతోనే మరణించారు. ముంబైలో మరణించిన అబ్దుల్లాకు అలహాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తే లాక్‌డౌన్ కారణంగా సల్మాన్ వాటికి దూరంగా ఉన్నారు. తన విషాదంతో పన్వేల్‌లోనే ఉండిపోయారు.

తాజాగా నిసర్గ తుఫాన్
మహారాష్ట్రను కరోనావైరస్ ఓ పక్క అతలాకుతలం చేస్తుంటే.. మూలిగే నక్కపై తాటి పండు పడినట్టుగా నిసర్గ తుఫాన్ తన ప్రతాపం చూపింది. ముంబై పరిసర ప్రాంతాలను ఈ తుఫాన్ చెలరగడంతో పలు చోట్లు చెట్లు విరిగి నానా బీభత్సం సృష్టించింది. దాంతో సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌పై భారీగా దెబ్బ తిన్నది.
Recommended Video

స్వయంగా చీపురు పట్టి..
సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్ హౌజ్‌పై తుఫాన్ చూపించిన ప్రభావం కారణంగా భారీగా వరద నీరు లోనికి వచ్చినట్టు తన స్నేహితురాలు లూలియా వాంటర్ ఓ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా చెట్లు విరిగి చెత్తతో నిండిపోయింది. దాంతో సల్మాన్ ఖాన్ తన ఫామ్‌హౌజ్‌ను క్లీన్ చేసుకొంటూ ఆ వీడియోలో కనిపించారు. ఇంకా తన స్నేహితులతో కలిసి ఫామ్‌హౌజ్‌ను శుభ్రం చేయడం అభిమానులను ఆకట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











