ధ్వంసమైన అజయ్ దేవగన్ ‘మైదాన్’ సెట్.. బోనికపూర్‌కు 30 కోట్ల నష్టం!
తౌక్తే తుఫాన్ విరుచుకుపడటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ తుఫాన్ ప్రభావం సినిమా పరిశ్రమపై కూడా భారీగా పడింది. ప్రముఖ నిర్మాత బోనికపూర్‌పై ఈ నష్ట ప్రభావం ఎక్కువగానే కనిపించింది.
అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న మైదాన్ చిత్రం కోసం భారీ సెట్‌ను ముంబైలో వేశారు. అయితే తౌక్తే తుఫాన్ దాటికి ఆ సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో బోనికపూర్ మాట్లాడుతూ.. మైదాన్ కోసం వేసిన సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ సినిమా కోసం ఆ సెట్‌ను వేయడం ఇది మూడోసారి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

మొదటి లాక్‌డౌన్ సమయంలో మైదాన్ కోసం వేసిన సెట్‌ను తొలిసారి కూలగొట్టాం. ఆ తర్వాత మళ్లీ రెండోసారి సెట్ వేసి చిత్రీకరించాం. ఆ తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత మరోసారి సెట్ నిర్మించాం. అయితే ప్రస్తుత తౌక్తే తుఫాన్ ధాటికి మళ్లీ సెట్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది అని బోనికపూర్ చెప్పారు.
మైదాన్ చిత్రాన్ని ఓటీటీలోను, థియేటర్‌లోను ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారనే వార్తలను కొట్టిపడేశారు. నా సినిమాలను కేవలం థియేటర్‌లోనే రిలీజ్ చేస్తాను. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా నడుస్తున్నాయి అంటూ వివరణ ఇచ్చారు. డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో పే పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తారనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో జరిగింది.


Click it and Unblock the Notifications











