అలాంటి దెబ్బతో నా లైఫ్ నాశనం.. సల్మాన్ ఫ్యామిలీపై దంబంగ్ డైరెక్టర్ ధ్వజం..సుశాంత్ జీవితం అలానే!

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని లుకలుకలన్నీ బయటకు వస్తున్నాయి. సినీ తారల వారసత్వం, బంధుప్రీతి, ఫేవరిటిజం, వేధింపులు, బయటి నుంచి వచ్చిన వారిపై అణిచివేత లాంటి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా సల్మాన్ ఖాన్ కుటుంబం దంబంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సల్మాన్, ఆయన సోదరుల వల్లే తన జీవితం భ్రష్టుపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుదీర్ఘమైన లేఖ రాసిన ఆయన సంచలన విషయాలను బయటపెడుతూ..

బాలీవుడ్ అరాచకాలు, సుశాంత్ మరణంపై దర్యాప్తు

బాలీవుడ్ అరాచకాలు, సుశాంత్ మరణంపై దర్యాప్తు

బాలీవుడ్‌లో చోటుచేసుకొంటున్న అరాచకాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలి. పరిశ్రమలోని మాఫియాపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోరాటం ఇక ముందు కొనసాగుతుంది. అప్పుడే నీ ఆత్మకు శాంతి చేకూరుతుంది. సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఇలాంటి దారుణాలను ఎదుర్కొంటున్నారనే విషయం సుశాంత్ మరణంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎలాంటి పరిస్థితులు ఉంటే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తాయో తెలుసా? అంటూ దంబంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ తన లేఖలో పేర్కొన్నారు.

మీటూ ఉద్యమాన్ని తొక్కినట్టే. సుశాంత్ సూసైడ్‌ను కూడా

మీటూ ఉద్యమాన్ని తొక్కినట్టే. సుశాంత్ సూసైడ్‌ను కూడా

బాలీవుడ్‌లో మీటూ ఉద్యమాన్ని అణిచివేసినట్టే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక కారణాలను బయటకు రాకుండా చేస్తున్నారనే విషయం నాకు భయాందోళనలు కలిగిస్తున్నది. సుశాంత్ మరణానికి యష్‌రాజ్ ఫిల్మ్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ కారణమనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. అధికారులు ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని అభినవ్ కశ్యప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనల వెనుక వైట్ కాలర్ దళారీల పాత్ర చాలా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు వల్లే

టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు వల్లే

టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఔత్సాహికుల కెరీర్లు బాగు చేయడానికి ఇసుమంతైనా పనిచేయవు. అంతేకాకుండా వారి జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. దశాబ్దాల కాలంగా నేను ఇలాంటి అకృత్యాలకు సాక్ష్యం. ప్రతీ టాలెంట్ మేనేజర్, టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలన్నీ ఆర్టిస్టులకు మృత్యుకుహారాలుగా మారుతాయి. వైట్ కాలర్ దళారీలకు సొంత ఎజెండా ఉంటుంది అని అభినవ్ తెలిపారు.

క్యాస్టింగ్ డైరెక్టర్ల మృత్యు వల

క్యాస్టింగ్ డైరెక్టర్ల మృత్యు వల

బాలీవుడ్‌లో యువ ప్రతిభావంతులను ట్రాప్ చేసేది క్యాస్టింగ్ డైరెక్టర్లే. కమిషన్ బేస్ మీద పనిచేసే వీరు ముంబైకి కోటి ఆశలతో వచ్చేవారిపై వల విసురుతారు. ఈ సెలబ్రిటీలను పరిచయం చేసే నెపంతో ఉచితంగా పార్టీలు, విందులకు ఆహ్వానిస్తున్నారు. అందుకు డబ్బు లాగేందుకు కూడా వెనుకాడరు. పార్టీలలో అవమానించేలా చేయడంతో కొందరు నైతికంగా దెబ్బ తింటారు. కొంతమంది తమపై ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఇలాంటి దారుణాలెన్నే క్యాస్టింగ్ డైరెక్టర్లు చేసిన దాఖలాలు ఉన్నాయి అని అభివన్ చెప్పారు.

సల్మాన్ కుటుంబం నన్ను దెబ్బ కొట్టింది

సల్మాన్ కుటుంబం నన్ను దెబ్బ కొట్టింది

ఇక బాలీవుడ్‌లో నా అనుభవం డిఫరెంట్. దంబంగ్ సినిమా తర్వాత సల్మాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ నన్ను రకరకాలుగా మోసగించాడు. నైతికంగా నన్ను దెబ్బ తీశాడు. దంబాంగ్ తర్వాత నన్ను దారుణంగా దెబ్బ తీశారు. అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ గొడవ పడి దంబంగ్ 2 నుంచి నన్ను తీసేశారు. నా రెండో సినిమా కోసం శ్రీ అష్ట వినాయక్ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌తో ఒప్పందం చేసుకొంటే.. ఆ కంపెనీ హెడ్ రాజ్ మెహతాకు ఫోన్ చేసి బెదిరించారు. నాకు ప్రాజెక్ట్ ఇస్తే విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాంతో ఆ సంస్థను వదిలేసి వయకామ్‌తో ఒప్పంద కుదుర్చుకొన్నాను అని అభినవ్ పేర్కొన్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Netizens Change Their Mind On Shraddha Kapoor And Kriti Sanon
పదేళ్లలో నన్ను దారుణంగా

పదేళ్లలో నన్ను దారుణంగా

దంబంగ్ తర్వాత దాదాపు 10 ఏళ్లు నాకు ఒక్క అవకాశం రాకుండా చేశారు. నాతో సినిమాలు చేయకుండా నిర్మాతలు బెదిరించారు. సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమాలు ఆగిపోయాయి. ఓ దశలో నేను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాను. సల్మాన్ ఖాన్ కుటుంబం అరాచకాలు నా జీవితంలో ఎన్నో చూశాను అంటూ విమర్శలు చేయడం బాలీవుడ్‌లో కొత్త వివాదానికి తెర తీసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X