రౌడీలా? గుండాలా?.. కుక్కను ఈడ్చినట్టు లాగి పడేశారు.. సల్మాన్ బాడీ గార్డులపై యువ నటి ఫైర్

బాలీవుడ్ వర్థమాన తార, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ హేమ శర్మ అలియాస్ వైరల్ బాబీకి చేదు అనుభవం ఎదురైంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన దంబాంగ్ 3 చిత్రంలో హేమ శర్మ చిన్న పాత్రను పోషించిన విషయం తెలిసిందే. అయితే 2019 సంవత్సరంలో హేమ శర్మపై సల్మాన్ ఖాన్ బాడీ గార్డులు దురుసుగా వ్యవహరించడం వివాదంగా మారింది. అయితే ఆ చేదు సంఘటనను గుర్తు చేసుకొంటూ ఆవేదనకు గురైంది. ఆ సంఘటన వివరాల్లోకి వెళితే..

దబాంగ్ సినిమాలో నటించడానికి నా శక్తి సామర్థ్యాలను ఉపయోగించాను. ఆ సమయంలో సల్మాన్ ఖాన్‌ను కలిసే ప్రయత్నం చేశాను. అలాంటి అవకాశం కల్పించిన భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకొన్నాను. కానీ నేను ఆయనతో కలిసి నటించే అవకాశం లభించలేదు. దాంతో నేను నిరాశపడ్డాను అని ఆనాటి సంఘటనను హేమ శర్మ గుర్తు చేసుకొన్నారు.

Dabangg 3 Actress Hema Sharma slams Salman Khans Bodyguards behaviour

అయితే సీన్ చిత్రీకరణ తర్వాత నేను సల్మాన్ ఖాన్‌ను కలిసే ప్రయత్నం చేశాను. దాంతో నేను సల్మాన్ ఖాన్ సార్‌ను కలువాలని కోరాను. సల్మాన్‌ను కలిసేందుకు చాలా మందిని అడిగాను. దాదాపు 50 మందిని రిక్వెస్ట్ చేశాను. సల్మాన్ ఖాన్‌ను కలిసి ఒక ఫోటో తీసుకోవాలని ఉందని చెప్పాను. కానీ ఆయనను కలువడానికి కుదర్లేదు అని వైరల్ బాబీ చెప్పారు.

చివరకు బిగ్‌బాస్‌లో కనిపించిన పండిట్ జనార్ధన్‌తో టచ్‌లో ఉన్నాను. సల్మాన్ సార్‌ను కలువాలి. ఆయనతో ఫోటో తీయించుకోవాలని ఉందని చెప్పాను. దాంతో జనార్ధన్‌తో కలిసి సల్మాన్‌ వద్దకు వెళ్లాను. కానీ ఆయనను చాలా దారుణంగా సల్మాన్ బాడీ గార్డులు ట్రీట్ చేశారు. 100 మంది ముందు నాతో నీచంగా ప్రవర్తించారు అని వైరల్ బాబీ అన్నారు.

సల్మాన్ బాడీ గార్డులు జనార్ధన్ పండిట్‌తోపాటు నన్ను కుక్కను ఈడ్చినట్టు ఈడ్చేశారు. ఆ సంఘటన తర్వాత నాకు 10 రోజుల వరకు నిద్రపట్టలేదు. ఆ విషయాన్ని మరిచిపోవడానికి చాలా కష్టమైంది. సల్మాన్ ఖాన్ బాడీ గార్డులు రౌడీలు గుండాల మాదిరిగా వ్యవహరించారు. ఈ మధ్య హీరో వికీ కౌశల్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది అని హేమ శర్మ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X