సల్మాన్ పశువు కంటే దారుణంగా.. సుదీప్ షాకింగ్ కామెంట్

విలక్షణ నటుడు సుదీప్ కిచ్చ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం దబంగ్ 3 చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి నటిస్తున్న సమయంలో తనతో పెరిగిన అనుబంధాన్ని ఇటీవల సుదీప్ పంచుకొన్నారు. హిందీ భాషలో మెలకువలను, ఎలా సంపాదించాననే విషయాన్ని ఆసక్తికరమైన విషయాన్ని ఆయన వెల్లడించారు. అలాగే సల్మాన్ వర్కవుట్ చేసే విధానాన్ని చూసి ముచ్చటేసిందని పేర్కొన్నారు.

బాలీవుడ్ పత్రికతో సుదీప్ మాట్లాడుతూ.. సల్మాన్ వర్కవుట్ కఠోరంగా చేస్తాడు. పశువు కంటే దారుణంగా కష్టపడుతాడు. శరీర ఫిట్‌నెస్ కోసం విపరీతమైన కృషిని చేస్తాడు అని తెలిపారు. ఓ స్టంట్ సీక్వెన్స్ సందర్భంగా తనను తన్నమని చెప్పాడు. తన్నితే చాలా బలంగా ఉండాలన్నారు. కానీ ఆయనపై గౌరవంతో నేను తన్నలేకపోయాను. కానీ ఆయన తన్నమని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. దాంతో దక్షిణాది ప్రేక్షకులకు తనంటే ఎంత గౌరవమో తెలిసిందని సల్మాన్ అన్నారని తెలిపారు.

Dabangg 3 Update: Kichcha Sudeep shocking comments on Salman Khan

షూటింగ్‌లో హిందీ డైలాగ్స్ చెప్పడానికి చాలా కష్టపడేవాడిని. అయితే పెద్ద పెద్ద డైలాగ్స్ ఇవ్వ కూడదని ప్రభుదేవాకు సల్మాన్ చెప్పాడు. దాంతో నాకు ఇబ్బంది కలుగకుండా డైలాగ్స్‌ను సులభంగా మార్చేశారని చెప్పారు. దాంతో నాకు డైలాగ్స్ చెప్పడం చాలా ఈజీ అయింది అని సుదీప్ పేర్కొన్నారు. సోనాక్షి సిన్హా, అర్బాజ్ ఖాన్ నటిస్తున్న దంబంగ్ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X