నా భార్యను రేప్ చేస్తామని బెదిరించారు, అలా కాపురం కూల్చారు.. సల్మాన్‌ ఫ్యామిలీపై డైరెక్టర్ నిప్పులు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ కుటుంబంపై దంబంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ తీవ్ర ఆరోపణలు చేయడం బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నది. తనను కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్లు చేసిన అరాచకాల కారణంగానే నా కాపురం కూలిపోయింది అని కశ్యప్ దారుణమైన విమర్శలు చేశారు. దంబంగ్ తర్వాత తాను తీసిన బేషరమ్ సినిమాను అడ్డుకోవడానికి, వ్యాపారం చెడగొట్టానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వారిని ఎదురించి నేను నిలబడ్డాను అని అనురాగ్ కశ్యప్ తన సుదీర్గమైన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కశ్యప్ చేసిన తీవ్రమైన ఆరోపణలు ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput లాగా ఎందరో.. Bollywood ఇంత దారుణమా..?

నాపై ప్రతీకారం తీర్చుకొనేందుకు

నాపై ప్రతీకారం తీర్చుకొనేందుకు

దంబంగ్ తర్వాత మా మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి. వాటితో నాపై ప్రతీకారం తీర్చుకొనేందుకు సల్మాన్ ఖాన్ సోదరులు నానా రకాలుగా ప్రయత్నించారు. అయినా ధైర్యంగా నిలబడి వారితో నేను పోరాడాను. ఆ తర్వాత చాలా సంవత్సరాలు నన్ను రకరకాలుగా వెంటాడారు. నన్ను మానసికంగా వేధించి నన్ను దెబ్బ తీయాలని ప్రయత్నించారు. వారి కుట్రలకు నేను ఏ కోణంలో కూడా భయపడలేదు అని అభినవ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నన్ను అంతం చేయాలని, బెదిరింపులు

నన్ను అంతం చేయాలని, బెదిరింపులు

నాపై ద్వేషం పెంచుకొన్న సల్మాన్ కుటుంబం నన్ను ఏదో రకంగా ఇండస్ట్రీ నుంచి అంతం చేయాలని ప్రయత్నించారు. నన్ను చంపుతామని బెదిరింపులు వచ్చాయి. నా కుటుంబంలో మహిళల ఫోన్ నంబర్లకు కాల్ చేసి బెదిరించారు. నా భార్య, ఇంట్లో ఆడవాళ్లను రేప్ చేస్తామని హెచ్చరించారు. అలా నా మెంటల్ హెల్త్‌ను కూడా దెబ్బ కొట్టాలని రకరకాలుగా ప్రయత్నించారు అని అభినవ్ కశ్యప్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

నా భార్య విడాకులు ఇచ్చి

నా భార్య విడాకులు ఇచ్చి

ఇక సల్మాన్ ఖాన్ కుటుంబం బెదిరింపుల వల్ల నా వ్యక్తిగత జీవితంలో దారుణాలు చోటుచేసుకొన్నాయి. 2017లో ఇలాంటి సంఘటనలు చూసిన నా భార్య బెంబేలెత్తింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకు, నాకు వ్యక్తిగత విభేదాలు చోటుచేసుకొన్నాయి. సల్మాన్ ఖాన్ సోదరులు బెదిరింపుల వల్లే నా భార్య నాకు విడాకులు ఇచ్చింది. అలా నా వైవాహిక జీవితాన్ని అలా దెబ్బ తీశారు అని అభినవ్ కశ్యప్ పేర్కొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోలేదు

పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోలేదు

అయినా నాపై వారి ప్రతీకార చర్యలు ఆగలేదు. నన్ను చంపుతామని బెదిరిస్తూ భారీ సంఖ్యలో మేసేజ్‌లు పంపారు. అందుకు నా వద్ద పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. దాంతో నేను 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమంటే అందుకు పోలీసులు కేసు పెట్టడానికి నిరాకరించారు. చివరకు ఏదో చిన్న కేసు పెట్టి మమా అనిపించారు. ఆ తర్వాత కూడా బెదిరింపులు కొనసాగాయి అని అభినవ్ కశ్యప్ వెల్లడించారు.

సోహైల్ ఖాన్ పనే అని చెబితే..

సోహైల్ ఖాన్ పనే అని చెబితే..

ఆ తర్వాత కూడా నాకు ఫోన్ కాల్స్ చేసి బెదిరించడం ఆగలేదు. నాకు వచ్చే ఫోన్ నంబర్లను గుర్తించాలని పోలీసులపై ఒత్తిడి చేశాను. అయితే అవి సొహైల్ ఖాన్ నుంచి వచ్చి ఉంటాయని నేను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా వద్ద అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నా శత్రువులు చాలా తెలివైన వారు. గత 10 ఏళ్లుగా దొంగచాటుగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అని అభినవ్ కశ్యప్ చెప్పారు.

ఏ ఒక్కరు సుశాంత్‌లా సూసైడ్ చేసుకోవద్దు

ఏ ఒక్కరు సుశాంత్‌లా సూసైడ్ చేసుకోవద్దు

సుశాంత్ విషయంలో జరిగిందేదో జరిగిపోయింది. ఏ లోకంలో ఉన్న సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నా. కానీ సినిమాలు లేకుండా, గౌరవం లేకుండా బాలీవుడ్‌లో ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎవరైనా ఇబ్బంది పడే యాక్టర్లు, సాంకేతిక నిపుణులు నా పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ విషయాలను మీడియా దృష్టికి తీసుకెళ్లండి. దాంతో చాలా మందికి మేలు జరుగుతుంది అంటూ బాయ్‌కాట్ సల్మాన్ ఖాన్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో అభినవ్ కశ్యప్ తన పోస్టును ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X