twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌లా సూసైడ్ చేసుకోలేదు, సల్మాన్ ఫ్యామిలీ కుట్రలు, మాఫియా‌ను ఎదిరించా: దంబంగ్ డైరెక్టర్ ఫైర్

    |

    దంబంగ్ తర్వాత సల్మాన్ ఖాన్ కుటుంబం నాపై దారుణంగా కక్ష్య కట్టారని డైరెక్టర్ అభివనవ్ కశ్యప్ సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు. దంబంగ్ తర్వాత నా రెండో సినిమాను శ్రీ అష్టవినాయక ఫిల్మ్స్‌తో చేయాలనుకొంటే దానిని సల్మాన్ సోదరులు అడ్డుకొన్నారు. ఆతర్వాత నేను వయాకామ్‌తో జతకడితే వారిని బెదిరించారు. దాంతో నేను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పందం చేసుకొన్నాను. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ సోదరులు ఏం చేశారంటే..

    అలాంటి దెబ్బతో నా లైఫ్ నాశనం.. సల్మాన్ ఫ్యామిలీపై దంబంగ్ డైరెక్టర్ ధ్వజం..సుశాంత్ జీవితం అలానే!అలాంటి దెబ్బతో నా లైఫ్ నాశనం.. సల్మాన్ ఫ్యామిలీపై దంబంగ్ డైరెక్టర్ ధ్వజం..సుశాంత్ జీవితం అలానే!

    వయాకామ్ సీఈవోను బెదిరించి

    వయాకామ్ సీఈవోను బెదిరించి

    దంబంగ్ సినిమా తర్వాత నా రెండో సినిమాను వయాకామ్‌తో చేయడానికి ఒప్పందం చేసుకొంటే.. ఆ కంపెనీ సీఈవో విక్రమ్ మల్హోత్రాను బెదిరించారు. దాంతో నా ప్రాజెక్టును చెడకొట్టారు. దాంతో నేను తీసుకొన్న రెమ్యునరేషన్‌ రూ.7 కోట్లతోపాటు 90 లక్షల వడ్డీతో కలిపి నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను బేషరమ్ అనే సినిమా కోసం రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకొన్నారు. అయితే ఆ సినిమా రిలీజ్‌ను ఆపేందుకు సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబం ప్రయత్నించారు. వాళ్ల పీఆర్వోలతో బేషరమ్ రిలీజ్‌కు ముందు సినిమాపై నెగిటివ్ క్యాంపెయిన్ చేయించారు అని అభినవ్ కశ్యప్ ఆరోపించారు.

    రిలయన్స్‌తో కలిసి సల్మాన్ కుటుంబంపై పోరాటం

    రిలయన్స్‌తో కలిసి సల్మాన్ కుటుంబంపై పోరాటం

    దాంతో నా బేషరమ్ సినిమాను కొనడానికి డిస్టిబ్యూటర్లు భయపడ్డారు. దాంతో సల్మాన్ ఖాన్‌ ఫ్యామిలీపై పోరాటం చేయాలని నిర్ణయించుకొన్నాం. నేను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సొంతంగా సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నాం. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద నా సినిమా కలెక్షన్లు రానివ్వకుండా కుట్రలు పన్నారు. సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ చేశారు. సినిమా బాగాలేదని ఇండస్ట్రీలో దుష్ప్రచారం చేశారు. అలా దుష్ట పన్నాగాలు పన్నినప్పటికీ రిలీజ్‌కు ముందే నా సినిమా రూ.58 కోట్లు సంపాదించింది.

    బేషరమ్ బిజినెస్‌ను దెబ్బ కొట్టేందుకు

    బేషరమ్ బిజినెస్‌ను దెబ్బ కొట్టేందుకు

    ఇక శాటిలైట్ బిజినెస్‌ను కూడా చెడగొట్టాడానికి సల్మాన్ కుటుంబం కుట్ర పన్నింది. అప్పటికే జీ టెలిఫిల్మ్స్‌ వ్యవహారాలను పర్యవేక్షించే జయంత్ లాల్ గడాతో బిజినెస్ ఒప్పందం చేసుకొంటే దానిని చెడగొట్టడానికి ప్రయత్నించారు. రిలయెన్స్‌కు ఉన్న క్రెడిట్‌ వల్ల మా శాటిలైట్ బిజినెస్ మంచి రేంజ్‌లోనే ముగిసింది.

    Recommended Video

    Sushant Singh Rajput : Netizens Change Their Mind On Shraddha Kapoor And Kriti Sanon
    పాలిటిక్స్‌, అండర్ వరల్డ్ అండతో

    పాలిటిక్స్‌, అండర్ వరల్డ్ అండతో

    నా శత్రువులు ఎవరనేది నాకు స్పష్టంగా తెలుసు. సలీమ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ ఎవరైనా గానీ అని లెక్కచేయలేదు. సల్మాన్ ఖాన్ కాకుండా ఇంకా ఇట్లాంటి దుష్టశక్తులు బాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. అక్రమ సంపాదనను అడ్డుపెట్టుకొని, లేదా రాజకీయ అండ చూసుకొని, అండర్ వరల్డ్‌తో సంబంధాలు పెట్టుకొని నన్నే కాదు ప్రతీ ఒక్కరిని బెదిరిస్తారు. నావైపు నిజాయితీ ఉంది కాబట్టి పోరాటం చేశాను. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదిరిగా నేను అఘాయిత్యానికి పాల్పడలేదు అంటూ దంబంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ తన కష్టాలను ఏకరువు పెట్టారు.

    English summary
    Dabangg director Abhinav Kashyap made serious allegations on Salman Khan Family. He mentioned in his facebook post that, I have experienced exploitation and bullying first hand Arbaaz Khan on Dabangg and ever since. So here is my story 10 years after Dabangg.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X