దబాంగ్3లో అదే హైలెట్.. హైదరాబాద్‌కు రానున్న సల్మాన్

బాలీవుడ్ లోనే కాదు.. ఏ ఇండస్ట్రీలోనైనా సరే సల్మాన్ ఖాన్ అనే పేరు తెలియని వారుండరు. వరుస హిట్లు, వరుస రికార్డులతో సల్మాన్ తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. కేవలం సల్లూ భాయ్ తెరపై కనిపిస్తే చాలు.. కనక వర్షం కురుస్తుంది. ఇప్పటికీ బాలీవుడ్ చిత్రాలు వందకోట్లు కొల్లగొట్టడానికి కిందా మీదా పడుతూ ఉంటే.. సల్మాన్ చిత్రాలు అవలీలగా వందకోట్లను కొల్లగొడుతుంటాయి. అయితే వంద కోట్లు కలెక్ట్ చేసినా సల్మాన్ సినిమాను ఫెయిల్ అని సంబోధిస్తుంటారు. సల్మాన్ అంటే మినిమమ్ 200, 300 కోట్లు కొల్లగొట్టాల్సిందే.

దబాంగ్3తో వసూళ్ల సునామి..

దబాంగ్3తో వసూళ్ల సునామి..

చుల్‌బుల్ పాండేగా దబాంగ్, దబాంగ్2లో సల్మాన్ చేసి విధ్వంసం అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్‌లో దబాంగ్ సిరీస్‌లకు ఉన్న క్రేజే వేరు. సల్మాన్ స్టైల్, పంచ్ డైలాగ్‌లు, కామెడీ టైమింగ్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రెండు సిరీస్‌లోనూ ప్రత్యేక గీతాలు సంచలనం సృష్టించాయి. తాజాగా దబాంగ్3తోనూ వసూళ్ల వర్షాన్ని కురిపించేందుకు వచ్చేస్తున్నాడు.

దగ్గరుండి మరీ ప్రమోషన్స్..

దగ్గరుండి మరీ ప్రమోషన్స్..

ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రమోషన్లలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సల్మాన్ ఖాన్. టీజర్, ఫస్ట్ లుక్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. దబాంగ్3 పై సల్మాన్ ఎంతగా ఆశలు పెట్టుకున్నాడో దాన్ని బట్టే తెలుస్తోంది.

అదే హైలెట్..

ఈ చిత్రంలో క్లైమాక్స్ ఫైట్ ఓ రేంజ్‌లో ఉండబోతోందని టాక్. వందల మంది రౌడీలను ఏరిపారేస్తుంటాడా మన కండల వీరుడు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను అదిరిపోయేట్టు తెరకెక్కించారని టాక్. మరి మాస్‌ను ఆకట్టుకునే క్రమంలో చేస్తోన్న ఈ ఫీట్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.

 హైద్రాబాద్‌లో ఈవెంట్..

హైద్రాబాద్‌లో ఈవెంట్..

సౌత్‌లోనూ ఈ చిత్రాన్ని బాగానే ప్రమోట్ చేయాలని సల్మాన్ ఫిక్స్ అయ్యాడు. అందుకే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో హైద్రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశాడు. ఈ ఈవెంట్‌కు కిచ్చా సుదీప్, సోనాక్షి సిన్హా, ప్రభు దేవా లాంటి వారు హాజరవుతున్నారు. సల్మాన్ 'దబాంగ్ 3' సినిమా ఈ నెల 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
 మరో చిత్రాన్ని ప్రారంభించిన సల్మాన్..

మరో చిత్రాన్ని ప్రారంభించిన సల్మాన్..

ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో ‘రాధే:యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'అనే మరో మూవీ షూటింగ్ కూడా ప్రారంభించేశాడు. సల్మాన్‌తో పాటు ఈ సినిమాలో దిశా పటానీ, రణ్ దీప్ హూడా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X