»   » అనుష్క శర్మకు దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డ్

అనుష్క శర్మకు దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహూకరించే దాదా 'సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్ 2018' ఈ సారి బాలీవుడ్ నటి అనుష్క శర్మను వరించబోతోంది. ప్రేక్ష‌కులు మెచ్చే చిత్రాల‌ను నిర్మించినందుకుగాను ఆమెకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

అనుష్క శర్మ తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈ ఇద్దరూ కలిసి 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' సంస్థను స్థాపించి 'ఎన్‌హెచ్ 10' అనే సక్సెస్ ఫుల్ సినిమా ద్వారా నిర్మాతలుగా తమ ప్రయాణం మొదలు పెట్టారు.

Dadasaheb Phalke Excellence Award for Anushka Sharma

చిన్న వయసులోనే ప్రొడక్షన్ స్థాపించి పలు అర్థవంతమైన, మంచి వినోదంతో కూడిన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఎంతో మంది కొత్త టెక్నీషియన్స్, నటీనటులకు తమ ప్రొడక్షన్ ద్వారా అవకాశం కల్పించి వారిలోని టాలెంటును వెలికితీసే ప్రయత్నం చేశారు.

'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' సంస్థ అందించిన సినిమాలు పలువురు సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్ 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు 2018'తో అనుష్కను సత్కరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

English summary
The Dadasaheb Phalke Excellence Award for 2018 is being awarded to Bollywood actor Anushka Sharma for her genre-defining successful movies. The 29-year-old actress is being widely revered for breaking new grounds as a film producer, along with her brother Karnesh Sharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X