twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: ప్రముఖ పాప్ సింగర్ దలెర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష..

    |

    ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహెందీకి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మనుషుల అక్రమ రవాణా కేసులో కోర్టు శుక్రవారం ఈ తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే.. పంజాబ్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

    దలేర్ మెహిందీ(50), శంషేర్ సింగ్ లు కలిసి కొంతమందిని అక్రమంగా అమెరికాకు తరలించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు గాను వీరిద్దరకి భారీగా డబ్బు ముట్టిందన్న ఆరోపణలున్నాయి.

    Daler Mehndi Gets 2 Years Jail In 2003 Human Trafficking Case

    1998,1999లో ఈ ఇద్దరు సోదరులు.. రెండు గ్రూపులుగా మొత్తం 10మందిని అమెరికాకు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. విదేశాల్లో తన సంగీత ప్రదర్శనలు ఇచ్చేందుకు వెళ్లిన సందర్భాల్లో దలేర్ మెహిందీ, అతని సోదరుడు ఈ చర్యకు పాల్పడ్డట్టు కోర్టు పేర్కొంది.

    1998లో అమెరికా వెళ్లినప్పుడు చట్టవిరుద్దంగా ముగ్గురు అమ్మాయిలను తమతో పాటు తీసుకెళ్లిన ఈ సోదరులు.. వారిని శాన్ ఫ్రాన్‌సిస్కో వదిలేసి వచ్చారన్న ఆరోపణలున్నాయి. అలాగే ఆ తర్వాత 1999లో మరోసారి అమెరికాకు వెళ్లినప్పుడు మరో ముగ్గురు అబ్బాయిలను అక్రమంగా అమెరికా తీసుకెళ్లి.. న్యూజెర్సీలో వారిని వదిలేసి వచ్చినట్టు ఆరోపణలున్నాయి.

    ఈ నేపథ్యంలో తొలుత పటియాల పోలీస్ వీరిపై కేసు నమోదు చేయగా.. ఆపై మరో 35కేసులు నమోదయ్యాయి. తాజా విచారణలో వీరిని దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పట్లో పటియాల పోలీసులు ఢిల్లీలోని వీరి కార్యాలయంపై దాడి చేసి పలు పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

    English summary
    Punjabi pop singer Daler Mehndi has been sentenced to two years in prison after he was convicted in a 2003 human trafficking case by a court in Delhi today, news agency ANI has reported. Daler Mehndi was reportedly taken into custody by the Punjab Police as soon as his conviction was announced.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X