Just In
Don't Miss!
- Sports
Yearend 2019: కలిసొచ్చిన రెండో అర్ధభాగం, ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా!
- News
వైసీపీ రంగులపైన హైకోర్టు సీరియస్: ప్రభుత్వ భవనాలకు వేస్తారా: నివేదిక ఇవ్వాలని ఆదేశం..!
- Technology
ఆపిల్ న్యూ మ్యాక్రో ప్రో కంప్యూటర్ కన్నా ఆడి కార్ కొనడం మేలట
- Lifestyle
వైరల్ వీడియో : కన్నతల్లిని ఢీకొట్టిందనే కోపంతో కారును కాలితో తన్నిన బుడ్డోడు... ఇంకా ఏం చేశాడంటే..
- Finance
12,000 పాయింట్లకు పైగా నిఫ్టీ, 300 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
- Automobiles
హోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సూసైడ్ చేసుకొంటానేమో.. బాధ ఎవరికి చెప్పుకోవాలి.. ‘దంగల్’ జైరా వసీం!
దంగల్ చిత్రంతో ప్రేక్షకులను యువ నటి జైరా వసీం విశేషంగా ఆకట్టుకొన్నారు. ఇటీవలే వచ్చిన సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రంలో గుండె బరువెక్కే పాత్రలో జీవించారు. ఆ చిత్రంలో ప్రతికూల పరిస్థితులను, మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చెప్పిన జైరా ప్రస్తుతం మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో సవివరమైన పోస్ట్‌లో తన మానసిక పరిస్థితులను బయటపెట్టారు.

మానసికంగా కుంగిపోయా
కొన్ని రోజులుగా మానసికంగా కుంగిపోయాను. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. నాలుగేళ్లుగా ఏదో జబ్బు పీడిస్తున్నది. ఓ దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపిస్తున్నది అని పోస్టులో పేర్కొన్నారు.

విపరీతమైన బాధతో
మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రతీరోజు ఐదు యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ తీసుకొంటున్నాను. ఒక్కోసారి విపరీతమైన బాధతో రాత్రిపూట కూడా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తున్నది. కొన్ని వారాల పాటు సరిగ్గా నిద్ర ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో విపరీతంగా నిద్రపోతున్నాను అని తన బాధలను పంచుకొన్నారు.

అనేక సమస్యలతో
ఇలాంటి మానసిక రుగ్మత వల్ల మితిమీరిన ఆహారాన్ని తీసుకొంటున్నాను. ఒక్కోసారి ఏదీ తినాలని అనిపించదు. కొన్నిసార్లు భోజనం చేయకుండా పస్తులతో ఉంటున్నాను. ఈ రుగ్మత వల్ల ఒంటినొప్పులు, శరీరం వాచిపోవడం వల్ల విపరీతమైన బాధ కలుగుతున్నది.

12 ఏళ్ల వయసులోనే
నాకు 12 ఏళ్ల వయసులో తొలిసారి తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను. రెండోసారి 14 ఏళ్ల వయసులో ఇలాంటి బాధను అనుభవించాను. ఆ తర్వాత లెక్కలేనన్ని పానిక్ అటాక్స్. ఎన్ని మందులు వాడానో కూడా తెలియదు అని జైరా ఆవేదన వ్యక్తం చేసింది.

17 ఏళ్లకే డిప్రెషనా?
సాధారణంగా 25 ఏళ్లు దాటితేనే మానసిక రుగ్మతకు చికిత్స ఉంటుంది అని వైద్యులు వెల్లడిస్తున్నారు. చికిత్స కోసం వెళితే 17 ఏళ్లకే డిప్రెషనా? ఈ వయసులో డిప్రెషన్ ఏంటని వైద్యులు ప్రశ్నిస్తున్నారు అని తన పోస్టులో పేర్కొన్నారు.

సోషల్ మీడియాకు దూరంగా
ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి విశ్రాంతి కోరుకొంటున్నాను. స్కూల్‌కు వెళ్లడం కూడా మానేస్తాను. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. నా బాధలు అర్థం చేసుకొని అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను అని జైరా వెల్లడించింది.