Dasara: భారీగా తగ్గిపోయిన దసరా టికెట్ రేట్స్.. వాళ్లకు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్
సహజ సిద్ధమైన నటనతో పాటు విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు నేచురల్ స్టార్ నాని. ఇలా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. నటుడిగానూ అంతకంతకూ ఎదుగుతూనే ఉన్నాడు. దీంతో మరింత ఉత్సాహంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడీ స్టార్ హీరో తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాగ్‌డ్రాప్‌తో 'దసరా' అనే సినిమాలో నటించాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన 'దసరా' మూవీకి ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. అదే కంటిన్యూ చేస్తూ మొదటి వీకెండ్‌లోనే ఈ మూవీ ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు బాగా చేరువగా వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా చిత్ర యూనిట్ టికెట్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'దసరా' మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. అన్ని చోట్లా దీనికి మంచి స్పందనే వస్తుంది. కానీ ఉత్తరాదిలో మాత్రం ఆశించిన రీతిలో ఆడియెన్స్‌ను థియేటర్లకు రాబట్టలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో సోమవారం నుంచి గురువారం వరకూ హిందీలో టికెట్ రేట్లను రూ. 112కు తగ్గించింది. ఈ ధరలు పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ సహా ఈ చిత్రం ప్రదర్శితం అవుతోన్న అన్ని థియేటర్లలో వర్తిస్తాయని కూడా వెల్లడించింది. దీంతో అక్కడ కూడా స్పందన మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక, నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన 'దసరా' మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణలు కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











