సుశాంత్ మరణం వెనుక దావూద్ ఇబ్రహీం.. మాజీ RAW ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటనేది ఇంత వరకు బయటపడలేదు. రోజుకో వార్త జనాల్లో కొత్త అనుమానాలను కలిగిస్తోంది. ఇక సుశాంత్ సింగ్ తో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా విచారిస్తున్న అధికారులు కూడా కేసు ఎంతవరకు వచ్చింది అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇక ఇటీవల మాజీ RAW ఏజెంట్ సుశాంత్ సింగ్ మృతిపై కొత్త తరహా అనుమానాలను లేవనెత్తారు.

మరణం వెనుక మాఫియా..

మరణం వెనుక మాఫియా..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ దాని వెనక ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు నెపోటిజమ్ పేరుతో సుశాంత్ ని కావాలని తొక్కేశారని కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు సుశాంత్ మరణం వెనుక మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.

రా ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు..

రా ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు..

మాజీ రా ఆఫీసర్ NK సూద్ ఇటీవల సుశాంత్ సింగ్ మృతిపై స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక వరల్డ్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పరాజయాల కారణంగా కృంగిపోతున్న సమయంలో ఉహీంచని విధంగా దావూద్ నుంచి అతనికి బెదిరింపులు వచ్చాయని అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

ఎందుకు బెదిరించాడు..

ఎందుకు బెదిరించాడు..

అయితే సుశాంత్ కి దావూద్ ఇబ్రహీమ్ ఎందుకు బెదిరించడానే విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ ఘటన విషయంలో అతని హస్తం బలంగా ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రపంచానికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్న దావూద్ ఇబ్రహీమ్ సడన్ గా బాలీవుడ్ వైపు ఎందుకు మళ్ళీ ఉంటారనే కొత్త అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Recommended Video

Dawood Ibrahim May Have Hand in Sri Devi's Case?
క్లారిటీ ఇస్తారా?

క్లారిటీ ఇస్తారా?

సుశాంత్ సింగ్ మరణానికి అసలు కారణం ఏమిటనేది తెలిసే వరకు ఇలాంటి కొత్త తరహా అనుమానాలు పుట్టుకొస్తునే ఉంటాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే కొంత మంది సినీ ప్రముఖులతో పాటు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ ని అలాగే దర్శకులను పోలీసులు విచారించారు. త్వరలోనే ఈ కేసుపై అధికారులు ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X