సుశాంత్ కేసులో కీలక మలుపు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై ప్రశ్నల వర్షం.. ముంబై డీసీపీ ట్వీట్
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. సన్నిహితులు, అనుమానితులను విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా తన స్నేహితుడు క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రాను బుధవారం జూన్ 17న విచారించారు. ఈ విచారణ సందర్భంగా పలు ప్రశ్నలను పోలీసులు సంధించి జవాబులు రాబట్టినట్టు డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు వెల్లడించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

సుశాంత్ గురించి ముఖేష్ చాబ్రా ట్వీట్
సుశాంత్ సింగ్‌కు ముఖేష్ చాబ్రా స్నేహితుడు. వారిద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. సుశాంత్ మరణ వార్త ముఖేష్‌కు తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. నాకు సుశాంత్ సోదరుడిలాంటి వారు. ఆయన మరణం నాకు గుండె కోతను మిగిల్చింది. నాకు మాటలు రావడం లేదు. ఆయన మరణం దురదృష్టకరం. సుశాంత్ మొహమాటస్తుడే.. కానీ తెలివైన వాడు. టాలెంట్ ఉన్న వ్యక్తి అని ముఖేష్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.

నాకు ఫోన్ చేయొద్దని మీడియాకు చాబ్రా రిక్వెస్ట్
ఇక సుశాంత్ మరణం తర్వాత క్రమంలో ముఖేష్ చాబ్రా తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెడుతూ.. డియర్ జర్నలిస్టులు, రిపోర్లర్లు, టీవీ ఛానెల్స్. సుశాంత్ మరణం నాకు వ్యక్తిగతమైన లాస్. తన మరణంతో నేను దిగ్బ్రాంతిలో మునిగిపోయాను. ఆ విషాదం నుంచి బయటపడాలంటే.. కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు నాకు కాల్స్ చేయవద్దు. ఒకవేళ కాల్ చేస్తే నాకు ఒత్తిడి కలిగించిన వారే అవుతారు. కొన్ని రోజులపాటు ఎవరితో మాట్లాడను అని పోస్టులో పేర్కొన్నారు.

క్యాస్టింగ్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్‌గా
ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లో చాలాకాలంగా ముఖేష్ చాబ్రా క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా సుశాంత్ సింగ్ హీరోగా డైరెక్టర్‌గా మారి తొలి సినిమా దిల్ బేచారా సినిమాను తెరకెక్కించారు. సుశాంత్ కెరీర్‌లో ఇదే చివరి సినిమాగా మారింది. ఈ క్రమంలో ముఖేష్ చాబ్రాను పోలీసులు విచారించారు.
Recommended Video

ముఖేష్ విచారణ అనంతరం డీసీపీ ట్వీట్
ముఖేష్ చాబ్రాను విచారించిన అనంతరం డీసీపీ అభిషేక్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో విచారణ అనంతరం ట్వీట్ చేస్తూ.. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్ అయిన యాక్సిడెంటల్ కేసును సూసైడ్ కేసుగా నమోదు చేశాం. క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రాను విచారించాం. సుశాంత్ నాకు మంచి స్నేహితుడు, సత్సంబంధాలు ఉన్నాయి. మంచి నటుడు అని డీసీపీ అభిషేక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











