యంగ్, ఓల్డ్ ఎవరైనా పర్వాలేదు.. లవ్‌లో పడేందుకు ఎదురుచూస్తున్నా.. రకుల్ ప్రీత్ సింగ్!

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మునుపటిలా ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు రాకున్నా కొన్ని క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో రకుల్ నటించింది. ఇటీవల రకుల్ కు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్ సరసన నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్ దే. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది.

50 ఏళ్ల వ్యక్తితో

50 ఏళ్ల వ్యక్తితో

దే దే ప్యార్ దే చిత్రానికి అకివ్ అలీ దర్శకుడు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ 50 ఏళ్ల వ్యక్తిగా నటిస్తున్నాడు. ఆ వయసులో పాతికేళ్ల అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ యువతి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అతడి నుంచి విడిపోయిన భార్యగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. వీరి ముగ్గురి మధ్య ఎలాంటి సరదా సన్నివేశాలు జరిగాయి అనేదే కథ. రకుల్ ప్రీత్ సింగ్ గతంలో కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించినా అవి వర్కౌట్ కాలేదు. దీనితో దే దే ప్యార్ దే చిత్ర ఫలితం కోసం రకుల్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

రెచ్చిపోతున్న రకుల్

రెచ్చిపోతున్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో అందాలు ఆరబోయడం చూసి అభిమానులంతా షాక్ అవుతన్నారు. దక్షిణాది చిత్రాలు ఎప్పుడూ రకుల్ ప్రీత్ సింగ్ ఇంత ఘాటుగా అందాల ప్రదర్శన చేయలేదు. ప్రచార చిత్రాల్లోనే అజయ్ దేవగన్, రకుల్ మధ్య రొమాన్స్ ఒక రేంజ్ లో ఉంది. ఇక సినిమాలో వీరిద్దరి రచ్చ ఎలా ఉంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రియల్ లైఫ్ లో తన ప్రేమ వ్యవహారాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఎవరైనా పర్వాలేదు

ఎవరైనా పర్వాలేదు

తానింతవరకు ప్రేమలో పడలేదని రకుల్ చెబుతోంది. దే దే ప్యార్ దే చిత్రం తరహాలో రియల్ లైఫ్ లో పరిస్థితి ఎదురైతే ప్రేమలో పడతారా అని ప్రశ్నించగా రకుల్ సరదాగా సమాధానం ఇచ్చింది. రియల్ లైఫ్ లో ప్రేమలో పడేందుకు ఎదురుచూస్తున్నా.. అతడు ఓల్డ్ అయినా, యంగ్ అయినా పర్వాలేదు. ప్రేమలో వయసు పెద్ద విషయం కాదు అని రకుల్ చెబుతోంది.

 ప్రేమ వ్యవహారాలు

ప్రేమ వ్యవహారాలు

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ దే దే ప్యార్ దే చిత్రం ప్రస్తుతం సమాజానికి బాగా సరిపోతుందని తెలిపింది. వయసుతో సంబంధం లేకుండా, గతంలో ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయి అనే విషయాలతో సంబంధం లేకుండా ప్రేమలో పడుతున్నారు. ఈ చిత్రం కూడా అలానే ఉంటుంది. ప్రేమ అంటే మనం వెతుకున్న తోడు.. అంతే కానీ వయసు కాదు అనే విధంగా ఈ చిత్రం ఉంటుందట. అలాగే ఈ చిత్రంలో బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయని రకుల్ ప్రీత్ సింగ్ చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X