For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ముక్కలుగా నరికేస్తాం.. రాఖీ సావంత్ ప్రియుడిపై దాడి.. కాళ్లు మొక్కినా వదల్లేదు (వీడియో)

  |

  సోషల్ మీడియాలో విచిత్రమైన లైవ్స్ స్ట్రీమింగ్, ఇతర వీడియోలతో ఆకట్టుకొంటూ కమెడియన్‌గా పేరు తెచ్చుకొన్న దీపక్ కలాల్‌కు కొందరు దేహశుద్ధి చేశారు. సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలను పోస్టు చేస్తున్నందుకు దీపక్ కలాల్‌ను దారుణంగా దాడి చేశారు. రాఖీ సావంత్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటన చేసి 2018 నవంబర్‌లో మీడియాలో హల్‌చల్ చేశాడు. తాజాగా దీపక్ నందల్ అనే వ్యక్తి ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో తన స్నేహితులతో కలిసి దాడి చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

  బూతు వీడియోలు పెడుతావా? అంటూ

  బూతు వీడియోలు పెడుతావా? అంటూ

  దీపక్ నందల్ బృందం చేసిన దాడికి దీపక్ కలాల్ బెదిరిపోయాడు. చిన్న పిల్లాడిలా గుక్కపెట్టి ఏడ్చాడు. దయ తలిచి నన్ను వదిలేయమని దీనంగా వేడుకొన్నాడు. అయినా ఆ బృందం కనకరించకపోగా దారుణంగా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సోషల్ మీడియాలో బూతు వీడియోలు పెడుతావా? అని ప్రశ్నిస్తూ ఎడాపెడా కొట్టారు.

  కొట్టొద్దు.. కాళ్లు మొక్కుతానని

  కొట్టొద్దు.. కాళ్లు మొక్కుతానని

  దీపక్ నందల్ దాడితో బెదిరిపోయిన దీపక్ కలాల్ ఇక సోషల్ మీడియాలో కామెడీ కార్యక్రమాలు చేయను. నన్ను కొట్టకుండా వదిలిపెట్టమని కాళ్లు పట్టుకొన్న వదలకుండా కొట్టారు. ఇంకోసారి సోషల్ మీడియాలో కనిపిస్తే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎక్కడ ఉన్న ముక్కలు ముక్కలుగా నరికేస్తాం అని హెచ్చరించారు.

  ఢిల్లీ పోలీసుల దృష్టికి దాడి ఘటన

  దీపక్ కలాల్‌పై జరిగిన దాడి ఘటనను కొందరు ఢిల్లీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దారుణంగా దాడి చేసిన నందల్ గ్రూప్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన వీడియో లింక్‌ను పోలీసులకు అందించారు.

  ఇండియా గాట్ టాలెంట్ 8 అనే షోతో

  ఇండియా గాట్ టాలెంట్ 8 అనే షోతో

  దీపక్ కలాల్ ఇండియా గాట్ టాలెంట్ 8 షోతో ప్రేక్షకాదరణ పొందాడు. అప్పటి నుంచి తనకు ఉన్న పాపులారిటీని ఉపయోగిస్తూ రకరకాల కామెడీ వీడియోలను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సంచలనం రేపాడు. అశ్లీలకరంగా అనిపించే వీడియోలతో యూత్‌ను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.

  రాఖీ సావంత్2 పెళ్లి అని

  రాఖీ సావంత్2 పెళ్లి అని

  గతేడాది నవంబర్‌లో బాలీవుడ్ సెక్స్‌బాంబ్ రాఖీ సావంత్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు శుభలేఖను తన ఇన్స్‌టాగ్రామ్‌లో దీపక్ కలాల్ పోస్టు చేశాడు. ఆ కార్డును రాఖీ సావంత్ కూడా షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ పెళ్లికి కరణ్ జోహర్, షారుక్ ఖాన్ హాజరవుతున్నట్టు దీపక్ పేర్కొన్నారు.

  దీపక్ కలాల్‌పై దాడి చేసింది ఎవరంటే

  దీపక్ కలాల్‌పై దాడి చేసింది ఎవరంటే

  ఇక దీపక్ కలాల్‌పై దాడి చేసిన దీపక్ నందల్ ప్రముఖ ర్యాపర్ ఫాజిల్‌పురియాకు సహాయకుడిగా పనిచేస్తున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాసుకొన్నారు. తాను మ్యూజిక్ డైరెక్టర్‌ అని కూడా చెప్పుకొన్నారు. బాలీవుడ్‌లో కొన్ని పాటలకు సంగీతం సమకూర్చినట్టు దీపక్ నందల్ పేర్కొన్నాడు.

  English summary
  Comedian Deepak Kalal's name is once again making it to headlines, but this time it's not because of Rakhi Sawant, who had announced her marriage to him back in November 2018. A video of Deepak Kalal being beaten up by the manager of Rapper Fazilpuria has made it to social media and it has gone viral now. In the viral video, a man named Deepak Nandal, along with his friends, can be seen beting up the India's Got Talent 8 fame comedian Deepak Kalal on the streets of Gurugram. Not just that, Nandal took his audacity to a whole new level by LIVE streaming the video of him bashing Kalal, on his Instagram page.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more