అతడి వ్యక్తిత్వమే అంత.. మాజీ ప్రియుడిపై మండిపడ్డ హీరోయిన్!

దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ వివాహం ఇటీవల ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత అంతే ఘనంగా బెంగుళూరులో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీరాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నా ఈ జంట ఈ ఏడాది వివాహంతో ఒక్కటి కావడం విశేషం. బాలీవుడ్ మొత్తం దీపికా రిసెప్షన్ కు హాజరైనా రణబీర్ కపూర్ మాత్రం హాజరు కాలేదు. దీనితో సినీప్రముఖుల్లో హాట్ హాట్ గా చర్చ జరిగింది. తాజాగా దీపికా తన మాజీ ప్రియుడి గురించి ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.

 దీపికతో ప్రేమాయణం

దీపికతో ప్రేమాయణం

రణబీర్ కపూర్ కు బాలీవుడ్ లో రొమాంటిక్ వీరుడిగా గుర్తింపు ఉంది. ఈ హ్యాండ్సమ్ హీరో మొహంలో పడ్డ హీరోయిన్ల జాబితా పెద్దదే. కత్రినా కైఫ్, దీపికా ఇలా బడా హీరోయిన్లే ఉన్నారు. రణబీర్ నుంచి విడిపోయాక దీపికా.. రణవీర్ సింగ్ ప్రేమలో పడింది. ఆ తరువాత రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ రిలేషన్ షిప్ కొనసాగడం, విడిపోవడం కూడా జరిగిపోయింది. ప్రస్తుతం రణబీర్.. క్యూట్ హీరోయిన్ అలియా భట్ ప్రేమలో ఉన్నాడు.

ఘాటుగా కామెంట్స్

ఘాటుగా కామెంట్స్

దీపికా పదుకొనె అందరి సెలెబ్రిటీలలాగే రణబీర్ ని కూడా తన రిసెప్షన్ కు ఆహ్వానించింది. కానీ రణబీర్ మాత్రం డుమ్మా కొట్టేశాడు. దీనిపై దీపికా పదుకొనె స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రిసెప్షన్ కు ముందు రణబీర్ తో మాట్లాడాను. రిసెప్షన్ కు రమ్మని ఆహ్వానించాను. కానీ అతడు రాలేదు. రిసెప్షన్ తర్వాత అతడితో మాట్లాడలేదు కాబట్టి కారణం నాకు తెలియదు. అతడు రాకపోవడంతో ఆశ్చర్యం లేదు. అతడి వ్యక్తిత్వమే అంత అంటూ దీపికా వ్యాఖ్యానించింది.

మనస్పర్థలు తొలగిపోయాయి

మనస్పర్థలు తొలగిపోయాయి

ఇదిలా ఉండగా దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ మధ్యకూడా సరైన సంబంధాలు లేవని బాలీవుడ్ లో గతంలో వార్తలు వినిపించాయి. కానీ కత్రినా కైఫ్.. దీపికా పదుకొనె రిసెప్షన్ కు హాజరు కావడం విశేషం. దీనిపై కత్రినా మాట్లాడుతూ ఆ రాత్రంతా డాన్స్ చేస్తూ తాను, కత్రినా చాలా సరదగా గడిపాం అని తెలిపింది. పలు చిత్రాల్లో దీపికా, రణవీర్ సింగ్ మధ్య కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

వివాహం తర్వాత కూడా

వివాహం తర్వాత కూడా

పెళ్ళైన పదిరోజులకే సింబా చిత్రంతో రణవీర్ సింగ్ బిజీ అయిపోయాడు. దీపికా పదుకొనె కూడా తన సినిమాతో బిజీగా మారనుంది. దీపికా, రణవీర్ సింగ్ నటించిన పద్మవత్ చిత్రం ఈ ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X