అలియా భట్ దీపికా పదుకొనె ఫన్నీ ఇన్సిడెంట్.. ఏకంగా మెన్స్ వాష్ రూమ్ లోకి వెళ్లి...
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ మధ్య స్నేహాలు చాలా తక్కువగా ఉంటాయి. బయటకు తెలియవు గాని కొంతమంది హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎవరు ఎలా ఉన్నా కూడా దీపికా పదుకొనె, అలియా భట్ మంచి స్నేహితులు. వీరు అప్పుడప్పుడు హాలిడేస్ వెకేషన్స్ కు కూడా వెళుతుంటారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని బయట పెట్టింది. అలియాతో పాటు ఏకంగా మెన్స్ వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయిందట.

మాజీ ప్రియుడి గర్ల్ ఫ్రెండ్ తో..
బాలీవుడ్ సినిమా ప్రపంచంలో కొన్ని స్నేహాలు చాలా విచిత్రంగా ఉంటాయి. దీపికా పదుకొనె తన మాజీ ప్రియుడి గర్ల్ ఫ్రెండ్ తో చాలా స్నేహంగా ఉంటుంది. రణ్ బీర్ కపూర్ అలియా భట్ మధ్య లవ్ ట్రాక్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో రణ్ బీర్ - దీపికా కూడా ప్రేమలో మునిగి తెలారు. అప్పట్లో వీరు పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ కొన్ని కారణాల వలన విడిపోవాల్సి వచ్చింది.

విబేధాలు ఉన్నట్లు రూమర్స్ వచ్చినా
ఇక దీపికా - రణ్ వీర్ ప్రేమలో ఉన్నప్పుడే దీపికకు అలియాకు మంచి స్నేహం ఉంది. ఇక మళ్ళీ అలియాతో మాజీ ప్రియుడు లవ్ ట్రాక్ లో ఉన్నట్లు తెలిసినా కూడా ఈ ఇద్దరు అదే తరహాలో వారి స్నేహాన్ని కంటిన్యూ చేస్తుండడం విశేషం. చాలా సందర్భాల్లో పార్టీలకు కూడా కలిసి వెళ్లారు. మీడియాలో వీరి మధ్య విబేధాలు ఉన్నట్లు రూమర్స్ వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోలేదు.

ఆ సినిమా ప్రమోషన్ లో
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీపికా పదుకొనె అలియాతో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను షేర్ చేసుకుంది. ప్రస్తుతం దీపికా గెహ్రాయా' సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఫిబ్రవరి 11న ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోయే ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దీపికా ఈ సినిమాల్ అక్రమ సంబంధం పెట్టుకునే యువతిగా కనిపించనుంది ఇప్పటికే ట్రైలర్ భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంది.

పర్సనల్ లైఫ్..
ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా దీపికా పదుకొనె తన చిత్ర యూనిట్ దర్శకుడు శకున్ బత్రాతో పాటు అనన్య పాండే, సిద్ధార్థ్ చతుర్వేదిలతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక ఆ ఇంటర్వ్యూలో ఆమె సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాల గురించి మాట్లాడింది. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంది.

మెన్స్ వాష్ రూమ్ కు వెళ్లి..
ముఖ్యంగా అలియా భట్‌తో కలిసి విదేశాల్లో ఓ మ్యూజిక్ కాన్సెర్ట్ కు వెళ్లిన సమయంలో తొందరపాటులో ఒక మిస్టేక్ చేశారట. బెర్లిన్ లో ఒకసారి అకస్మాత్తుగా వాష్ రూమ్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఉమెన్స్ క్యూ లైన్ పెద్దగా ఉందని మెన్స్ వాష్ రూమ్ లోకి కలిసి వెళ్ళినట్లుగా చెప్పుకొచ్చింది. ఆ బాత్రూమ్స్ శుభ్రంగా లేకపోయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినట్లుగా దీపికా నవ్వుకుంటూ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











