Gehraiyaan: సోదరి భర్తతో దీపికా పదుకొన్ అక్రమ సంబంధం.. ఆ పాత్ర చేయడానికి ముందే అతనితో

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ప్రస్తుతం ఉన్న వారిలో దీపికా పదుకొన్ ఒకరు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ హైలెట్ అవుతుంది అని జనాల్లో ఒక మంచి నమ్మకం ఏర్పడింది. ఇక ఇటీవల కాలంలో దీపికా కాస్త భిన్నమైన ప్రయోగాత్మకమైన సినిమాలను ఎక్కువగా చేస్తోంది. ఇక నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతున్న గెహ్రియాన్ సినిమాపై కూడా మొదటి నుంచి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది.

ఇక ఈ సినిమాలో దీపికా తన సోదరి భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతిగా కనిపించబోతోంది. ఇక ఆ పాత్ర చేయడానికి ముందు ఆమె తన సహ నటుడితో ఎలా కొనసాగింది అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చేసింది.. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోలతో సినిమాలు

స్టార్ హీరోలతో సినిమాలు

గ్లామర్ బ్యూటీ దీపిక పదుకోన్ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలో దాదాపు అందరు స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. కేవలం సీనియర్ స్టార్ హీరోలతోనే కాకుండా నేటి తరం యువ హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.

అనవసరంగా వివాదాల్లో..

అనవసరంగా వివాదాల్లో..

మొదటి నుంచీ కూడా దీపికా పదుకొన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. కథ విషయంలో ఆమె జడ్జిమెంట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చాలాసార్లు ఇతర నటీనటులు సినీ ప్రముఖులు తెలియజేశారు. ఇక పర్సనల్ లైఫ్లో కొన్నిసార్లు అనవసరమైన విషయాల్లో తలదూర్చి కొన్ని విమర్శలు ఎదుర్కొన్న ఇప్పటికీ తనకి కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

బోల్డ్ కంటెంట్ తో గెహ్రియాన్

బోల్డ్ కంటెంట్ తో గెహ్రియాన్

గెహ్రియాన్ సినిమా నేడు అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాను శకున్ బాత్రా డైరెక్ట్ చేశాడు. దీపికా పదుకొన్ తో పాటు సిద్దార్థ్ చదుర్వేది, అనన్య పాండే, ధైర్య కార్వా ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన బజ్ అయితే బాగానే ఉంది. టాక్ కూడా విభిన్నంగా వస్తోంది.

రొమాన్స్ సీన్స్ లో..

రొమాన్స్ సీన్స్ లో..

గత రెండు వారాలుగా దీపికా పదుకోన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో చాలా బిజీగా ఉంది. ఈ సినిమా ఒక డిఫరెంట్ కంటెంట్ తో కూడుకున్నదని తెలియజేసిన దీపికా నటీనటులతో నటించడానికి ముందుగా కొంత హోమ్ వర్క్ కూడా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. సిద్ధార్థతో ఆమె చేసిన కొన్ని సన్నివేశాలు సినిమాలో చాలా హైలెట్ గా నిలిచాయి. రొమాంటిక్ సన్నివేశాల్లో దీపికా గతంలో ఎప్పుడూ లేనివిధంగా చాలా ఘాటుగా నటించినట్లు కామెంట్స్ చేస్తున్నారు.

తనకంటే చిన్న వారితో ఘాటైన సీన్స్

తనకంటే చిన్న వారితో ఘాటైన సీన్స్

ఇక అలాంటి సన్నివేశాలు చేయడానికి ముందు నటీనటులు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకి సాగినట్లుగా దీపికా తెలియజేసింది. నీ కంటే చిన్న నటులతో రొమాన్స్ చేయడం ఎలా అనిపించిందని అడిగినప్పుడు.. ఈ చిత్రంలో తాను రొమాన్స్ చేసే అబ్బాయిలిద్దరూ చాలా చిన్నవయసులో ఉన్నారని, తనతో రొమాన్స్ చేయడానికి చాలా భయపడ్డారని దీపిక చెప్పింది.

రొమాన్స్ చేసే ముందు..

రొమాన్స్ చేసే ముందు..

ఇక మొదట ఈ సినిమా సన్నివేశాలు చేసే ముందు తాను సిద్ధాంత్‌ తో కలిసి కూర్చున్నానని, కొంత టెన్షన్ లో ఉంటే ఈ సన్నివేశాల గురించి అతనితో మాట్లాడటం ద్వారా అతనిని కూల్ చేసినట్లుగా దీపికా వివరణ ఇచ్చింది. కేవలం సహనటుడిలా మాత్రమే ఆలోచించమని దీపిక అతనికి సూచించిందట. సినిమాలో ఆ సీన్స్ చాలా విభిన్నంగా కొత్తగా ఉంటాయని కూడా వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X