Don't Miss!
- News Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అది నీకు హ్యాపీ అయితే నాకు హ్యాప్పీయే.. రణ్వీర్తో సహజీవనంపై దీపిక పదుకోన్
బాలీవుడ్లో కెరీర్‌ను బ్రహ్మండంగా కొనసాగిస్తూనే రణ్వీర్ సింగ్‌తో అందాల తార దీపిక పదుకోన్ వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నది. గతేడాది ఇటలీలోని లేక్ కోమోలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా వీరిద్దరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడుతూ వైవాహిక జీవితం, సహజీవనం, కెరీర్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దీపిక పదుకోన్ ఏం చెప్పారంటే..
పెళ్లికి ముందు ఎమోషనల్‌గా
పెళ్లికి ముందు అంగరంగ వైభవంగా వివాహ వేడుకను జరుపుకోవాలని అనుకోలేదు. అసలు సంప్రదాయ వివాహాన్ని జరుపుకోవాలనే ఆలోచన లేదు. ఎమోషనల్ బాండింగ్‌తో మా జీవితం కొనసాగుతున్న సమయంలో సంప్రదాయ వివాహానికి దూరంగా ఉండాలని అనుకొన్నాం అని దీపిక పదుకోన్ వెల్లడించారు.
రణ్వీర్ ఆలోచన ఎలా ఉందంటే
రణ్వీర్ సింగ్‌కు ఎలాంటి పద్దతిలో వివాహం చేసుకోవాలనే విషయంపై పూర్తిగా అవగాహన లేదు. ఎలాంటి వివాహమైన ఫర్వాలేదనే ఆలోచనతో ఉన్నాడు. నీకు ఎలా సంతోషంగా ఉంటే.. అలాంటి సంతోషాన్ని నాకు ఇవ్వుమని చెప్పాడు. ఏది జరిగినా సరైన సమయంలో సరైన రీతిలో జరుగాలనే ప్లాన్‌తో ముందుకెళ్లాం. అందుకు నా తల్లిదండ్రుల జీవితమే నా కళ్ల ముందు కనిపించేది అని దీపిక చెప్పారు.
పెళ్లికి ముందు సహజీవనంపై
పెళ్లికి ముందు సహజీవనం చేశారా అనే ప్రశ్నపై ఆసక్తిగా దీపికా పదుకోన్ స్పందించారు. వివాహానికి ముందే సహజీవనం చేస్తే.. పెళ్లి తర్వాత జీవితంలో మధురానుభూతిని పొందగలమా అని ప్రశ్నించారు. పెళ్లికి ముందే కాదు.. ఆ తర్వాత కూడా మా జీవితాలకు సంబంధించి గొప్ప నిర్ణయాలు తీసుకొన్నాం. కొందరు పెళ్లి గురించి చెత్తగా మాట్లాడితే నచ్చదు. మాకు వివాహ వ్యవస్థపై బలమైన నమ్మకం ఉంది అంటూ దీపికా పదుకోన్ అన్నారు.
కెరీర్‌కు పెళ్లి అడ్డంకి..
పెళ్లి తర్వాత కెరీర్ గురించి స్పందిస్తూ.. మా ఇంట్లో నా తల్లిదండ్రులు వర్కింగ్ పేరెంట్స్. నా సోదరి కూడా అలానే జీవితాన్ని కొనసాగిస్తున్నది. పెళ్లి తర్వాత కెరీర్‌ను కొనసాగిస్తూనే మా తల్లిదండ్రులు గొప్ప జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కెరీర్‌కు పెళ్లి అడ్డంకి కాదనే విషయాన్ని నమ్ముతాను. కెరీర్ హోదాను, గౌరవాన్ని కల్పిస్తుందని భావిస్తాను. అది కూడా నా తల్లిదండ్రుల నుంచే నేర్చుకొన్నాను అని దీపిక పదుకోన్ చెప్పింది.
దీపిక పదుకోన్ కెరీర్ గురించి
కెరీర్ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో దీపిక పదుకోన్ వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నది. పీకూ, బాజీరావు మస్తానీ, పద్మావత్ చిత్రాల విజయాలను తన ఖాతాలో వేసుకొన్నారు. ప్రస్తుతం ఛపాక్ చిత్రంలో నటిస్తూ నిర్మాతగా కూడా మారింది. ఇక రణ్వీర్తో కలిసి 83 అనే చిత్రంలో నటిస్తున్నారు. xxx చిత్రంతో హాలీవుడ్లో కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే.