రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా.. అది లేకుండా సెక్స్ చేయలేము..బ్రేకప్‌పై దీపికా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్‌లోని ప్రేమ వ్యవహారాలు, సహజీవనం, బ్రేకప్‌లు మరెక్కడా కనిపించవేమో. స్టార్ హీరో హీరోయిన్ల ప్రేమ, డేటింగ్, బ్రేకప్ విషయాలు నిత్యం వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. బ్రేకప్ అనంతరం మళ్లీ వేరే వారితో ప్రేమలో పడటం జరగుతూ ఉంటుంది. అయితే మధ్య మధ్యలో తమ గతాన్ని, ప్రియుడో ప్రియురాలో చేసిన గాయాన్ని గుర్తు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా దీపికా పదుకొణె కూడా అలానే వార్తల్లోకెక్కింది. అదేంటో ఓ సారి చూద్దాం.

 దీపికా ప్రేమాయణం..

దీపికా ప్రేమాయణం..

రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. రెండేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి పీఠలు కూడా ఎక్కుతారని వార్తలు వచ్చాయి. తీరా చూస్తే తనను మోసం చేశాడని రిలేషన్ షిప్ నుంచి బయటకు వచ్చేసింది దీపికా. నాటి విషయాలను గుర్తు చేసుకున్న దీపికా.. తాజాగా ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించింది.

సెక్స్ అంటే అది కాదు..

సెక్స్ అంటే అది కాదు..

బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. సెక్స్ అంటే కేవలం శరీరానికి సంబంధించినదే కాదని, అందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయని చెప్పుకొచ్చింది. తాను రిలేషన్ షిప్‌లో ఎన్నడూ మోసం చేయలేదని తెలిపింది. పదే పదే ఫూల్‌ను చేస్తూ ఉంటే అలాంటి రిలేషన్ షిప్ అవసరమా? అని చెప్పుకొచ్చింది. దానికి బదులు ఒంటరిగా ఉంటే బెటర్ అని అనిపించేదని అయితే అందరూ తనలా ఆలోచించకపోవచ్చని పేర్కొంది.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా..

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా..

రిలేషన్ షిప్‌లో ఒకసారి అవతలి వాళ్లు తప్పు చేస్తే.. మన తప్పు కూడా ఉండొచ్చని అంది. అయితే పదే పదే తప్పులు జరుగుతూ ఉంటే.. అసలు తప్పు వారిలోనే ఉంటుందని చెప్పుకొచ్చింది. తాను రెండో అవకాశం ఇవ్వడమే తన తప్పని, బతిమిలాడుకోవడం, అడుక్కోవడంతో ఇచ్చానని, అయితే అప్పటికే అందరూ చెబుతున్నారని అయినా తాను విలేదని చెప్పింది. ఒకసారి తానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, అప్పటి నుంచి రిలేషన్ షిప్‌క్ స్వస్తి పలికానని పేర్కొంది.

బయటకు రావడానికి సమయం..

బయటకు రావడానికి సమయం..

అందులోంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టిందని తెలిపింది. అయితే అదంతా జరిగిపోయింది కదా ఏదీ కూడా మళ్లీ వెనక్కి తీసుకెళ్లలేదని పేర్కొంది. ఆ కథ అంతా ముగిసిందని చెప్పుకొచ్చింది. ఇంత వివరంగా చెబుతున్నా కూడా పలాన వ్యక్తి అని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు.

Recommended Video

Vijay Deverakonda,Deepika Padukone Spotted @ Mumbai Airport | Filmibeat Telugu
అది లేకుండా సెక్స్ చేయలేము..

అది లేకుండా సెక్స్ చేయలేము..

తాను రిలేషన్ షిప్స్‌లో ఎంతో ఇచ్చాననని, ఏనాడు ఏది ఆశించలేదని తెలిపింది. ఒకసారి అనుమానాలు వస్తే.. మోసపోయానని తెలిస్తే.. గౌరవం చచ్చిపోతుంది. నమ్మకం ఉండదు. రిలేషన్ షిప్‌లో ఇవి లేకుండా సెక్స్ చేయలేమని చెప్పుకొచ్చింది. దీపికా రణ్‌బీర్ నుంచి 2009లో విడిపోయాక.. రణ్‌వీర్ సింగ్‌ను 2018 నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. రణ్‌బీర్ మాత్రం కత్రినాతో ప్రేమ వ్యవహారం నడిపి ప్రస్తుతం అలియా భట్‌తో ఎంజాయ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X