twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    20 గంటలు అదే పని.. ఆ 4 గంటలు.. గృహ నిర్భంధంలో రణ్‌వీర్ గురించి దీపిక

    |

    కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో బాలీవుడ్ ప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ సమయాన్ని దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ దంపతులు బాగా సద్వినియోగం చేసుకొంటున్నారు. గృహ నిర్బంధంలోనే ఉంటూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తమ అనుభవాలను పంచుకొంటున్నారు. తాజాగా సినీ జర్నలిస్టు రాజీవ్ మసంద్‌తో మాట్లాడుతూ.. తమ గృహ నిర్బంధం గురించిన ఆసక్తికరమైన వివరాలను దీపికా పదుకోన్ బయటపెట్టారు. ఆమె ఏం చెప్పారంటే..

     ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు

    ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు

    రణ్‌వీర్ సింగ్ చాలా సింపుల్ వ్యక్తి. ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు పడే వ్యక్తిత్వం కలవాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సింపుల్‌గా హ్యాండిల్ చేయవచ్చు. అతడి వల్ల నాకు ఇబ్బంది ఏమి లేదు. నా పనులను చేసుకొనేందుకు ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదు అని దీపికా పదుకోన్ చెప్పారు.

    గ‌ృహ నిర్బంధంలో ఎక్కువగా

    గ‌ృహ నిర్బంధంలో ఎక్కువగా

    రణ్‌వీర్ సింగ్ ఎక్కువగా నిద్రపోతూనే ఉన్నాడు. రోజుకు సుమారు 20 గంటలు పడుకొంటున్నాడు. కేవలం నాలుగు గంటలు మాత్రమే మెలుకువగా ఉంటున్నాడు. ఆ మధ్యలో సినిమాలు చూడటం, తినడం, ఎక్సర్‌సైజ్ చేయడం లాంటివి చేస్తుంటాడు. ఎలాంటి డిమాండ్లు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు అని దీపికా పదుకోన్ చెప్పారు.

    నాకు వంటలు వచ్చు.. కానీ

    నాకు వంటలు వచ్చు.. కానీ

    ఇక రణ్‌వీర్ సింగ్ వంటగదిలోకి అసలే అడుగుపెట్టడు. వెస్టర్న్, ఇటాలియన్, కాంటినెంటల్ వంటలు చేయడం నాకు బాగా వచ్చు. కానీ వంట చేయడానికి చాలా భయంగా ఉండేది. కానీ నాకు భారతీయ వంటలు నేర్చుకోవాలని ఉంది. మైదా, గొధుమ పిండి, ధనియా, పూదినా మధ్య తేడాలను తెలుసుకోవాలనుకొంటున్నాను అని ఓ ప్రశ్నకు దీపికా పదుకోన్ సమాధానం ఇచ్చారు.

    దేశంలో పరిస్థితులు గంభీరంగా

    దేశంలో పరిస్థితులు గంభీరంగా

    దేశంలో నెలకొన్న పరిస్థితులు చాలా గంభీరంగా ఉన్నాయి. సమాజంలో ఏం జరుగుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకొనే తెలివి తేటలను సంపాదించుకొన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలనే విషయంపై అందరికీ అవగాహన ఉంది. ప్రతీ ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ బాధ్యతతో మెదగాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అని దీపికా పదుకోన్ అన్నారు.

     21 రోజుల లాక్‌డౌన్ గురించి

    21 రోజుల లాక్‌డౌన్ గురించి

    ఇది ఏ ఒక్కరోజుకో సంబంధించినది కాదు. ఒకవారం కూడా కాదు. మొత్తంగా 21 రోజుల లాక్‌డౌన్ గడువు. కాబట్టి ఇది అందరి జీవితాల్లో భావోద్వేగమైన అంశం. చాలా మందికి ఈ పరిస్థితి అర్ధం కావడం లేదు. కాబట్టి ఇది ఎలాంటి భయంకరమైన అనుభవమో గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దీపికా పదుకోన్ వెల్లడించారు.

    English summary
    Bollywood actress Deepika Padukone expressed her views about Coronavirus and Ranveer Singh in 21 days of Corona lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X