అదిరిపోయే అప్డేట్.. మళ్లీ తెరపైకి మహా భారతం.. ద్రౌపదిగా దీపికా పదుకొణె
ఏ ముహుర్తాన దర్శకధీరుడు రాజమౌళి.. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించాడో కానీ అప్పటి నుంచి మేకర్స్ అందరూ దానిపై దృష్టి పెట్టారు. మహాభారతాన్ని ఒక్క పార్ట్‌లో తీయలేమని, ఒకవేళ తాను మహాభారతాన్ని మొదలు పెడితే అదే తన చివరి సినిమా అవుతుందని అప్పట్లో జక్కన్న చెప్పిన సంగతి తెలిసిందే. కనీసం ఏడు ఎనిమిది భాగాలైనా తీయాల్సి ఉంటుందని చెప్పకనే చెప్పాడు.

మళ్లీ తెరపైకి రామాయణ, మహాభారతాలు
మహా భారతం టాపిక్ ఎప్పుడైతే మళ్లీ వార్తల్లోకి వచ్చిందే.. రామాయణాన్ని కూడా వెండితెరపై మళ్లీ ఆవిష్కరించాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అల్లు అరవింద్ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. తాజాగా రామాయణానికి సంబంధించి బాలీవుడ్ ప్రొడ్యూసర్‌లతో చేతులు కూడా కలిపాడు.

ఇప్పటికే పల్లు భాషల్లో తెరపైకి
రామాయణ, మహాభారతాలను ఇప్పటికే దాదాపు అన్ని భాషల్లో తెరకెక్కించినా మళ్లీ.. నేటి సమాజానికి, తరానికి అందించాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ వీటిపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలో రీసెంట్‌గా కురుక్షేత్రం సినిమా వచ్చింది. భారీ క్యాస్టింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టు కోలేకపోయింది. మళయాలంలో కూడా ఈ టాపిక్‌పై భీముని కోణంలో మోహన్‌లాల్ కూడా సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు.
ఆమిర్ ఖాన్ ప్రయత్నాలు..
భారీ బడ్డెట్‌తో మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ఆమిర్ ఖాన్ కూడా ముందుకు వచ్చాడు. కానీ మళ్లీ వెనక్కి తగ్గిపోయాడు. అయితే ఆమిర్ మదిలో మాత్రం ఆ కోరిక అలానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు మహాభారతం, రామాయణం లాంటి గాథలపై చిత్రాలను తెరకెక్కించేందుకు సుముఖుత వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మరో అప్డేట్...
దీపికా పదుకొణె ద్రౌపదిగా నటించనుందని, అంతేకాకుండా నిర్మాణంలో కూడా భాగస్వామ్యం కానుందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. వివిధ సిరీస్‌లుగా తెరకెక్కించే ఈ మూవీలో ద్రౌపదిగా దీపికా పదుకొణే నటిస్తోందని, నిర్మాత మధు మంటేనాతో కలిసి నిర్మాణంలో భాగస్వామ్యం కానుందని, మొదటి పార్ట్ వచ్చే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపాడు.

పద్మావతిగా అదరగొట్టిన దీపికా..
పద్మావతి సినిమాలో దీపికా తన నటనతో రాణీ పద్మావతిని తలపించేలా నటించి అందర్నీ మెప్పించింది. అందం, ఆహార్యంలోనే కాదు నటనలోనూ హుందాతనం చూపించే దీపికా.. ద్రౌపది పాత్రలో మెప్పిస్తుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ మూవీకి సంబంధించిన మిగతా వివరాలను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











