డ్రగ్స్ కోసం బాలీవుడ్ వాట్సాప్ గ్రూప్.. అడ్మిన్‌గా దీపిక పదుకోన్.. ప్రముఖ స్టార్లు సభ్యులుగా..
బాలీవుడ్‌తో డ్రగ్స్ సంబంధాల దర్యాప్తులో భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిత్యం ఆరాధించే సినీ ప్రముఖులు డ్రగ్స్ మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు అభిమానులను షాక్ గురిచేస్తున్నది. తాజాగా వెలుగుచూసిన దీపిక పదుకోన్ వాట్సప్ గ్రూప్ సంచలనంగా మారింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణలో వివాదాస్పద అంశాలు బయటకు రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తాజాగా దీపిక పదుకోన్ మెయింటెన్ చేస్తున్న వాట్సప్ గురించి వివరాల్లోకి వెళితే..

డ్రగ్స్ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్
డ్రగ్స్ రాకెట్‌తో బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థతోపాటు క్వాన్ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వీరంతా కలిసి డ్రగ్స్ కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకొన్నాయి. ఆ గ్రూప్ పేరు DP+KA+KWAN అని నామకరణం చేసుకొన్నారు. ఈ గ్రూప్ ద్వారానే డ్రగ్స్ కొనుగోలు, సమకూర్చుకోవడం, వినియోగం లాంటివి చేస్తుంటారు అనే విషయాన్ని రిపబ్లిక్ టెలివిజన్ తన కథనంలో పేర్కొన్నారు

దీపిక పదుకోన్ అడ్మిన్‌గా
ఇక DP+KA+KWAN గ్రూప్‌లో DP అంటే దీపిక పదుకోన్ అని, KA అంటే కరిష్మా అని, KWAN అంటే క్వాన్ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థగా డీకోడ్ చేశారు. ఈ గ్రూపును రియా చక్రవర్తి మేనేజర్ జయ సాహా ఏర్పాటు చేయగా, దీపిక పదుకోన్, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ అడ్మిన్‌గా ఉన్నారు. ఈ గ్రూపులో విజయ్ సుబ్రమణ్యం, అరింబన్ దాస్, టాలీవుడ్ నిర్మాత మధు మంతెన, క్వాన్ సీఈవో ధ్రువ్ చిట్‌గోపెకర్‌తోపాటు మరికొందరు ఉన్నట్టు సమాచారం.

వాట్సప్ గ్రూపులో మరికొందరు ప్రముఖులు
డ్రగ్స్ కోసం ఛాటింగ్ చేసుకోవడం కోసం ఓ వాట్సప్ గ్రూప్‌ను బాలీవుడ్ ప్రముఖులు ఏర్పాటు చేసుకొన్నారు. ఆ గ్రూప్‌కు దీపిక పదుకోన్ అడ్మిన్‌గా ఉన్నారు అని ఎన్సీబీ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గ్రూపులో ఇంకా ఎవరెవరు సభ్యులు అనే విషయంపై రకరకాల ఊహగానాలు మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ఎన్సీబీ అధికారులు స్పందిస్తే తప్ప.. ఆ గ్రూప్‌లో సభ్యులెవరనేది అధికారికంగా తెలియదనే మాట వినిపిస్తున్నది.
Recommended Video

ధర్మ ప్రొడక్షన్ ప్రతినిధులపై ఎన్సీబీ పంజా
ఇదిలా ఉండగా, ధర్మ ప్రొడక్షన్‌పై ఎన్సీబీ అధికారులు పంజా విసిరారు. కరణ్ జోహర్ ఉద్యోగి క్షిటిజ్ రవి ప్రసాద్ ఇంట్లో ఉదయం సోదాలు జరిపారు. భారీగా డ్రగ్స్ కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉండటంతో ఆయనను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకొన్నారు. అలాగే ధర్మ ప్రొడక్షన్స్‌లోని అసిస్టెంట్ డైరెక్టర్ అనుభవ్ చోప్రాను ఎన్సీబీని ప్రశ్నించినట్టు రిపబ్లిక్ టీవీ కథనాన్ని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











