For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దీపిక ఫ్యామిలీలో టెన్షన్.. ఆమె సహా మొత్తానికి కరోనా పాజిటివ్?

  |

  కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అలాగే భారీ ఎత్తున మరణాలు కూడా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా క‌రోనా సెకండ్ వేవ్ సెల‌బ్రిటీల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే అన్ని బాషలకు చెందిన ఎంతో మంది సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డ‌గా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకోన్ ఇంట్లో అంద‌రికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే

  దీపిక ఫ్యామిలీ మొత్తానికి

  దీపిక ఫ్యామిలీ మొత్తానికి

  దీపిక తండ్రి, మాజీ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ ప్ర‌కాశ్ ప‌దుకోన్‌, ఆమె త‌ల్లి ఉజాలా, చెల్లెలు అనీషాల‌కు క‌రోనా సోకినట్లు సమాచారం. ఇండియా త‌ర‌ఫున తొలిసారి ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ టోర్నీ గెలిచిన 65 ఏళ్ల‌ ప్ర‌కాశ్ ప‌దుకోన్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప‌ది రోజుల కింద‌ట ఇంట్లో అంద‌రికీ స్వ‌ల్ప ల‌క్షణాలు క‌నిపించాయ‌ని, తెలుస్తోంది.

  ప్రకాశ్ హాస్పిటల్ లో

  ప్రకాశ్ హాస్పిటల్ లో

  ఈ నేపధ్యంలోనే టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింద‌ని ప్రకాశ్ స‌న్నిహితుడు, బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ డైరెక్ట‌ర్ విమ‌ల్ కుమార్ మీడియాకి సమాచారం ఇచ్చారు. ఇక కరోనా సోకాక వారం రోజులు ఇంట్లోనే ఉన్నా ప్ర‌కాశ్‌కు జ్వ‌రం త‌గ్గ‌క‌పోవ‌డంతో హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేసిన‌ట్లు అకాడ‌మీ డైరెక్ట‌ర్ విమ‌ల్ కుమార్ తెలిపారు. మ‌రోవైపు దీపికా త‌ల్లి, చెల్లెలు ఇంట్లోనే కోలుకుంటున్నారని తెలుస్తోంది. ఇక మరో రెండో రోజుల్లో ప్రకాష్‌ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

  దీపికకు కూడా కరోనా

  దీపికకు కూడా కరోనా


  అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు దీపికా పదుకొనేకి కూడా కరోనా పాజిటివ్ అని తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఆరోగ్యం గురించి ఆమె టీంను సంప్రదించడానికి ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఇక ఈ వారం ప్రారంభంలో, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి దీపిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.

  గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు

  గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు

  "నేను మరియు నా కుటుంబం సహా లక్షలాది మంది ఇప్పుడు ఈ కరోనా బారిన పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ ప్రస్తుత సంక్షోభంలో మన మానసిక స్థితిని కూడా ముఖ్యమైనదని మర్చిపోవద్దు! గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. మనం అంతా కలిసే ఉన్నామని అన్నారు. ముఖ్యంగా, పరిస్థితుల మీద హోప్ ఉంచాలని ఆమె పేర్కొన్నారు.

  Prabhas ప్యాన్ ఇండియా స్టార్ నుండి Universal Star గా మారుతాడు | #PrabhasNagshwin || Filmibeat Telugu
  వరుస సినిమాలతో బిజీ

  వరుస సినిమాలతో బిజీ

  ఇక ఇదిలా ఉంటే దీపికా ప్రస్తుతం భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి `83` అనే సినిమాలో నటిస్తుంది. కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇక ఈ సినిమాతో పాటు అమిత్‌ శర్మ దర్శకత్వంలో `ది ఇంటెర్న్` అనే సినిమా చేస్తుంది. అలాగే షారూఖ్‌తో `పఠాన్‌`లో కూడా నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు శకున్‌ బట్రా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతుంది. ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `సర్కస్‌` సినిమాలో గెస్ట్ రోల్ లో మెరవబోతుంది.

  English summary
  Earlier today Deepika Padukone’s family has tested positive for Covid-19. Padukone’s mother and sister are diagnosed with Coronavirus and have opted for home quarantine, while her father Prakash Padukone has been hospitalised. Now some reports say that Deepika Padukone too has tested positive for Covid-19.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X