Gehraiyaan on Amazon శృంగారంతో రెచ్చిపోయిన దీపిక పదుకోన్, అనన్య పాండే.. ఆ ఒక్కడితో ఇద్దరు రొమాన్స్!

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ హవా రోజు రోజుకు పెరుగుతుండటంతో యూత్‌ను టార్గెట్‌గా చేసుకొని లవ్, ఎమోషనల్; యాక్షన్, క్రైమ్ అంశాలతో సినిమాలు వస్తున్నాయి. ఓటీటీకి సెన్సార్‌ కూడా లేకపోవడం వల్ల శృంగారం మోతాదు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దాంతో అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు, మానవ సంబంధాలపై సినిమాలను దర్శక, నిర్మాతలు ఎక్కువగానే టార్గెట్ చేస్తున్నారు. అలాంటి కోవలో వస్తున్న చిత్రమే గెహ్రాయియాన్. మాస్, మసాల కంటెంట్ దట్టించిన ఈ ట్రైలర్, సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

దీపిక పదుకోన్, అనన్య పాండే కలిసి..

దీపిక పదుకోన్, అనన్య పాండే కలిసి..

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ దీపిక పదుకోన్, అనన్య పాండే, సిద్దార్థ్ చతుర్వేది, ధైర్య కర్వా లాంటి తారలు నటిస్తున్న గెహ్రాయియాన్ చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తుండగా, షకున్ బాత్రా దర్వకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను కరోనావైరస్ కారణంగా వర్చువల్‌గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు.

ఎమోషనల్ కథ, సినిమా టైటిల్ గురించి

ఎమోషనల్ కథ, సినిమా టైటిల్ గురించి

గెహ్రాయియాన్ ట్రైలర్ రిలీజ్ వేడుక కార్యక్రమానికి కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సందర్బంగా కరణ్ జోహర్ మాట్లాడుతూ.. ఎంతో భావోద్వేగంతో కొనసాగే కథకు, సినిమాకు టైటిల్ ఖరారు చేయడం కష్టంగా మారింది. నెలన్నర క్రితం ఈ సినిమాకు గెహ్రాయియాన్ అనే టైటిల్‌ను ఖారారు చేశాం అని తెలిపారు. ఈ సినిమా కథను, కథలోని ఎమోషన్స్‌ను ఒక పదంతో చెప్పడం చాలా కష్టం అలని అనన్య పాండే అన్నారు.

ఆధునిక ప్రపంచంలో రొమాన్స్, రిలేషన్స్

ఆధునిక ప్రపంచంలో రొమాన్స్, రిలేషన్స్

గెహ్రాయియాన్ చిత్రం ఆధునిక ప్రపంచంలో యువతీయువకుల మధ్య ఉండే రొమాన్స్‌గా సినిమా తెరకెక్కింది. సమకాలీన పరిస్థితుల్లో వాస్తవికత, నిజాయితీ, ఉద్వేగభరితమైన సంబంధాల గురించి ఈ సినిమా చర్చించింది. దర్శకుడు షకున్ ఈ సినిమాలో లవ్, రిలేషన్‌షిప్స్ గురించి లోతుగా చర్చించారు. నవీన నాగరిక ప్రపంచంలో యువతి యువకుల మధ్య రిలేషన్స్ గురించి చూపించబోతున్నాం అని గెహ్రాయియాన్ టీమ్, అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది.

కజిన్ కాబోయే భర్తతో దీపిక రొమాన్స్

కజిన్ కాబోయే భర్తతో దీపిక రొమాన్స్

గెహ్రాయియాన్ చిత్రంలో దీపిక పదుకోన్, అనన్య పాండే కజిన్స్‌గా నటిస్తున్నారు. అనన్య పాండే కాబోయే భర్తగా సిద్దార్థ్ చతుర్వేది నటించారు. సిద్దార్థ్‌తో దీపిక పరిచయం తర్వాత వారిద్దరి మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. స్త్రీ, పురుషుల మధ్య ఉండే చీకటి సంబంధాలను గెహ్రాయియాన్ చిత్రంలో తెరకెక్కించారు.

వివాహేతర సంబంధంతో దీపిక పదుకోన్

వివాహేతర సంబంధంతో దీపిక పదుకోన్

దీపిక పదుకోన్ తన కజిన్ (అనన్య పాండే) పెళ్లి చేసుకోబోయే వ్యక్తి (సిద్దార్థ్)తో ఆకర్షణకు లోనవుతుంది. అతడితో పీకల్లోతు శృంగార జీవితంలో మునిగిపోతుంది. అప్పటికే దీపికకు మరో వ్యక్తితో పెళ్లి జరిగి ఉంటుంది. ఇలాంటి సమయంలో దీపిక, సిద్దార్థ్ మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కడికి దారి తీసాయి. ఈ సంబంధం దీపిక పదుకోన్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందనే కోణంలో గెహ్రాయియాన్ సినిమా ట్రైలర్‌‌లో సన్నివేశాలు ఆవిష్కతమయ్యాయి.

రొమాన్స్ హై ఓల్టేజ్.. దీపిక కెమిస్ట్రీ

రొమాన్స్ హై ఓల్టేజ్.. దీపిక కెమిస్ట్రీ

గెహ్రాయియాన్ చిత్రంలో దీపిక పదుకోన్ శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. అప్పటికే భర్తతో కాపురం చేస్తున్న దీపిక పదుకోన్ పరాయి పురుషుడితో అక్రమ బంధాన్ని కొనసాగించడం.. వారి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు హై రేంజ్‌లో కనిపించాయి. సిద్ధార్థ్ చతుర్వేది, దీపిక మధ్య సన్నివేశాలు హై ఓల్టేజ్ కనిపించింది. అలాగే వారిద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ సూపర్‌గా వర్కవుట్ అయింది. దాంతో ఈ సినిమా కోసం యూత్‌ కాచుకొని కూర్చున్నారు.

అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 11న రిలీజ్

అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 11న రిలీజ్

లవ్, రొమాన్స్, అడల్ట్ కంటెంట్, ఎమోషన్స్ కలబోసి రూపొందించిన గెహ్రాయియాన్ చిత్రం ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ అవుతున్నది. దాదాపు 240 దేశాల్లో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలు పక్కాగా ఓటీటీకి సరిపోయే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఓటీటీ తెరపై లవ్, రొమాంటిక్ కంటెంట్ ఏ రేంజ్‌లో మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

గెహ్రాయియాన్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

గెహ్రాయియాన్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు


నటీనటులు: దీపిక పదుకోన్, అనన్య పాండే, సిద్దార్థ్ చతుర్వేది, ధైర్య కర్వా, నసీరుద్దీన్ షా, రజత్ కపూర్ తదితరులు
కథ, దర్శకత్వం: షకున్ బాత్రా
నిర్మాతలు: హీరో యష్ జోహర్, కరణ్ జోమర్, అపూర్వ మెహతా, షకున్ బాత్రా
సినిమాటోగ్రఫి: కౌశల్ షా
ఎడిటింగ్: నితేష్ భాటియా
మ్యూజిక్: కబీర్ కథాపలియా, సవేరా మెహతా
బ్యానర్స్: ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్కా ఫిల్మ్స్
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2022-02-11

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X