twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపిక పదుకోన్ ‘ఛపాక్’ మూవీకి కొత్త సమస్య... వరుసగా లీక్ అవుతున్న సీన్లు!

    |

    Recommended Video

    Deepika Padukone Film Chhapaak Shooting Videos Out In Social Media ! || Filmibeat Telugu

    బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ త్వరలో 'ఛపాక్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఢిల్లీ యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెకెక్కుతోంది. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది.

    దీపిక పదుకోన్, విక్రాంత్ మాస్సేపై కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గ్రీన్ కుర్తా, గ్రీన్ సల్వార్ ధరించిన దీపిక ఆటోలో నుంచి దిగుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.

    వరుస లీకులు

    'ఛపాక్' చిత్రానికి సంబంధించిన సీన్లు లీక్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో దీపిక, విక్రాంత్‌పై ఢిల్లీ మార్కెట్లో చిత్రీకరించిన సీన్లు సైతం లీక్ అయ్యాయి. అయితే జనసమూహం మధ్య షూటింగ్ జరుగుతుండటంతో వీటిని ఆపడం ఎవరితరం కావడం లేదు.

    ఛపాక్

    మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్న 'ఛపాక్' చిత్రానికి దీపిక కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. కెఏ ప్రొడక్షన్స్, మ్రిగ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెుంట్స్ లేకుండా ప్రజలకు స్పూర్తినిచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    ఈ సినిమా చేయడంపై దీపిక

    ఈ సినిమా చేయడంపై దీపిక

    ఛపాక్ గురించి దీపిక వెల్లడిస్తూ.. 'గాయపడి, గెలిచిన వ్యక్తి కథ. మనిషి యొక్క బలమైన ఆత్మవిశ్వాసాన్ని తెలిజేసే కథ. ఇలాంటి కథ చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సినిమా రాబోతోంది' అని తెలిపారు.

    మాల్తి పాత్రలో దీపిక

    మాల్తి పాత్రలో దీపిక

    ఈ చిత్రంలో దీపిక పదుకోన్ మాల్తి అనే పాత్రలో కనిపించబోతున్నారు. మల్తి పాత్ర తన జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుందని దీపిక తెలిపారు. దీపిక లక్ష్మీ అగర్వాల్ పాత్ర పోషిస్తుండగా ఆమె భర్త, పాత్రికేయుడు అలోక్‌ దీక్షిత్‌ పాత్రలో విక్రాంత్‌ మాస్సే కనిపించనున్నారు. జనవరి 10, 2020న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Deepika Padukone and Vikrant Massey's film Chhapaak shooting videos leaked. Directed by Meghna Gulzar, Chhapaak is based on the life of acid attack survivor Laxmi Agarwal. The film is set to hit the screens on January 10, 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X