డ్రగ్స్ కేసు విచారణలో దీపిక కన్నీరు.. డ్రామాలొద్దు అంటూ అధికారుల ఫైర్

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతోందో అందరికీ తెలిసిందే. సుశాంత్ కేసు దగ్గర మొదలైన ఈ కేసు.. ఎందరి భండారాన్నో బయటపెడుతోంది. డ్రగ్స్ కేసులో పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఇరుక్కుంటున్నారు. అరెస్ట్‌లు, విచారణలతో బాలీవుడ్ మొత్తం అట్టుడికిపోతోంది. ఈ ఊబిలో ఇంకెంత మంది పడతారో తెలియదు గానీ ప్రస్తుతం దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్‌‌లు మాత్రం విచారణలో కొన్ని విషయాలను బయటపెట్టారట. ఈ మేరకు జాతీయ మీడియా చానెళ్లు అనేక కథనాలను ప్రచురించాయి. అందులో ఏముందంటే..

శ్రద్దా, సారా అలా..

శ్రద్దా, సారా అలా..

సుశాంత్ సింగ్‌తో చిచ్చోరే సినిమాలో నటించింది శ్రద్దా కపూర్. కేదార్‌నాథ్ సినిమాలో సారా అలీఖాన్ నటించింది. శ్రద్దా, సారాలు విచారణలో భాగంగా సంచలన నిజాలు చెప్పారు. షూటింగ్‌ సమయంలో క్యారావ్యాన్‌లోకి వెళ్లి డ్రగ్స్ తీసుకునేవాడని శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌‌లు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ‘కేదార్‌నాథ్‌‌' సినిమా సమయంలో సుశాంత్‌తో సన్నిహితంగా ఉన్నానని తెలిపినట్టు సమాచారం. అప్పుడప్పుడు అతని ఫాంహౌస్‌లో జరిగే పార్టీలకు వెళ్లానని.. కానీ ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని సారా చెప్పినట్టు తెలుస్తోంది.

దీపిక ఇలా..

దీపిక ఇలా..

దీపిక పదుకోన్‌ను సుమారు ఐదుగంటలపాటు విచారించారట. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దీపిక మూడు సార్లు కన్నీరు పెట్టుకుందట. ఇలా వుమెన్ కార్డ్‌ను వాడకు.. డ్రామాలు ఆపి ఆడిగిన వాటికి సమాధానం చెప్పమని అధికారులు దీపికపై ఫైర్ అయ్యారట.

ఒప్పుకుంది కానీ..

ఒప్పుకుంది కానీ..

టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహాతో చేసిన వాట్సప్ చాట్ తనదేనని అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే తాను డ్రగ్స్‌ తీసుకోలేదని అధికారులకు వెల్లడించిందట. ఆ వాట్సప్ గ్రూప్‌కు అడ్మిన్ కూడా తానేనని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
అందరి ఫోన్లు స్వాధీనం..

అందరి ఫోన్లు స్వాధీనం..

విచారణలో భాగంగా దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రద్ధాకపూర్‌, దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఎన్‌సీబీ అధికారి అశోక్‌ జైన్‌ మాట్లాడుతూ.. ‘డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా పలువురు నటీమణుల్ని విచారించాం. వారి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశాం. సదరు రికార్డ్‌లను కోర్టుకి అందజేస్తాం. అలాగే వాళ్ల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. సదరు నటీమణులు చెప్పింది నిజమా? కాదా?అని తెలుసుకోవడం కోసం సెల్‌ఫోన్‌ చాట్స్‌ పరిశీలిస్తాం' అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X