ప్రియా వారియర్‌కు దీపికా సవాల్.. చేయడం కష్టమని చేతులెత్తేసిన వింక్ గర్ల్
కన్నుగీటి, ముద్దు గన్నులు పేల్చి దేశాన్ని ఓ ఊపు ఊపేసిన ప్రియ ప్రకాశ్ వారియర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ప్రియా వారియర్‌కు అమాంతం కోట్ల మంది అభిమానులు వచ్చి పడ్డారు. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లు పెరిగారు. అయితే ఇదంతా ఒరు అదార్ లవ్ చిత్రం రిలీజ్ కాకముందు. ఒకసారి ఆ సినిమా విడుదలయ్యాక ప్రియా ప్రకాశ్ క్రేజ్ అమాంతం పడిపోయింది. అయితే ఆమె కన్ను గీటును, ముద్దు గన్నును మాత్రం ఎవ్వరూ మరిచిపోలేదు.

కథలో కూడా మార్పులు..
ప్రియా వారియర్‌కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలో కూడా మార్పులు చేశారు. ఆమె చుట్టే కథ తిరిగేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేశారు. అయితే సినిమా ఫలితం మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. అంతవరకు ప్రియా వారియర్‌కు వచ్చిన క్రేజ్‌ను ఈ మూవీ ఫలితం మొత్తం మార్చివేసింది.
తాజాగా దీపికా పదుకొణె..
బాలీవుడ్ అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న దీపికా పదుకొణె.. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ వస్తోంది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తీసిన సినిమా ‘ఛపాక్'లో దీపికా నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మరోసారి వింక్ గర్ల్ వార్తల్లో నిలిచింది.

ప్రియాకు దీపికా సవాల్..
‘ఛపాక్' సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో భాగంగా ఆమె తన స్టైల్‌లో కన్నుగీటింది. ‘దీన్ని స్వీకరించు ప్రియా వారియర్' అంటూ సవాలు చేసింది. దీన్ని చూసిన ప్రియా వారియర్.. ‘దేవత కన్నుగీటిందా..? మీ కంటే బాగా చేయడం కష్టం' అని కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











