దీపిక పదుకోన్ మెడకు డ్రగ్ ఉచ్చు.. టెన్షన్‌లోను హీరోయిన్ ఎత్తులు..రంగంలోకి రణ్‌వీర్ సింగ్
గత కొద్ది రోజులుగా బాలీవుడ్ అగ్రతార దీపిక పదుకోన్ పేరు బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో ప్రముఖంగా వినిపించడం సెన్సేషనల్‌గా మారింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ కేసులో విచారణకు సమన్లు జారీ చేస్తారనే వార్తలు రెండు రోజులుగా ఊపందుకొన్నాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బాలీవుడ్ ప్రముఖ తారలకు సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్ కుదుపుకు లోనైంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సినిమా షూటింగ్‌కు ప్యాకప్
డ్రగ్స్ విచారణ వార్తల నేపథ్యంలో దీపిక పదుకోన్ ప్రస్తుతం గోవాలో షూటింగులో ఉన్నారు. సమన్లు ఏ క్షణంలోనైనా జారీ చేయవచ్చనే వార్తల ఊపందుకోవడంతో మధ్యాహ్నమే ఆమె షూటింగ్ పూర్తి చేసుకొన్నారు. సినిమా షూటింగ్ ప్యాకప్ చెప్పి ముంబైకి వెళ్లే ఏర్పాట్లు చేసుకొన్నారనే వార్తలు వచ్చాయి.

సెప్టెంబర్ 24న విచారణకు
డ్రగ్స్ సప్లయిదార్లతో తన మేనేజర్ కరిష్మా ప్రకాశ్ సంబంధాలు బయటకు రావడంతో దీపిక పదుకోన్‌కు ఈ కేసులో ఉచ్చు బిగిసింది. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. తాజా సమన్ల ప్రకారం దీపిక పదుకోన్ సెప్టెంబర్ 24వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంది.

12 మంది లీగల్ నిపుణులతో రణ్‌వీర్ సింగ్
ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేయడంతో దీపిక పదుకొన్ తన ఎత్తుగడలను, వ్యూహాలను తెరపైకి తెచ్చింది. తన టీమ్‌తో ఈ సమన్లపై ఎలా స్పందించాలనే విషయాన్ని చర్చించారు. అంతేకాకుండా తన లీగల్ టీమ్‌ను సలహాలను, సూచనలు ఇవ్వాలని చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వీడియో కాలింగ్ ద్వారా 12 మందితో కూడిన లీగల్ నిపుణులతో రణ్‌వీర్ సింగ్, దీపిక మాట్లాడినట్టు తెలిసింది.
Recommended Video

గోవా నుంచి ముంబైకి ప్రయాణం
తాజా సమాచారం ప్రకారం.. ఎన్సీబీ విచారణ నేపథ్యంలో న్యాయపరమైన సలహాలు తీసుకోవడానికి దీపిక పదుకోన్ బుధవారం సాయంత్రం 7 గంటలకు గోవా నుంచి బయలు దేరనున్నారు. సుమారు 9 గంటల ప్రాంతంలో ఆమె ముంబైకి చేరుకొనే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











