దీపికా పదుకోన్‌ను అమ్మేస్తున్నారు.. కావాలంటే ఆర్డర్ చేయండి.. లిస్టులో సన్నీలియోన్ కూడా!
సాధారణంగా వినియోగదారుల మార్కెట్‌లో ఖాతాదారులను ఆకర్షించడానికి షాపు యజమానులు రకరకాల మార్కెటింగ్ వ్యూహాలు డిజైన్ చేస్తుంటారు. బట్టల దుకాణంలో సినిమాల పేరుతో చీరలు, హోటల్స్‌లో ఎమ్మెల్యే దోశ అని పేర్లు పెడుతుండటం మనకు తెలిసిందే. అమెరికాలో ఓ యజమాని తన హోటల్‌లో లభించే తిను బండారాలకు ఇప్పటికే సన్నిలియోన్, మియా ఖలీఫా అనే పేర్లు పెట్టుకొన్నాడు. తాజాగా బాలీవుడ్ అందాలతార దీపికా పదుకోన్ పేరు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

టెక్సాస్ హోటల్‌లో దోశకు పేరు
అమెరికాలో టెక్సాస్‌లోని ఓ హోటల్‌లో తయారు చేసే దోశకు దీపికా పదుకోన్ దోశ అని పేరు పెట్టారు. మంటలు పుట్టించేంతగా మిర్చి, ఆలుగడ్డ గుజ్జుతో ఖాతాదారులకు నోరు ఊరించే విధంగా తయారు చేయడం ఈ దోశ ప్రత్యేకత. ఆ హోటల్‌లోని మెనును ఓ భారతీయ ఖాతా దారుడు షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

పది డాలర్లకు దీపిక దోశ
టెక్సాస్ హోటల్ మెనులో కనిపించిన ప్రకారం దీపికా పదుకోన్ దోశ ఖరీదు అక్షరాల పది డాలర్లు. అంటే రూపాయల్లోకి మార్చితే సుమారు రూ.700లు. ఈ దోశకు ఖాతాదారుల నుంచి బ్రహ్మండమైన డిమాండ్ ఉన్నట్టు సమాచారం.

ఢిల్లీలో సన్నీలియోన్, మియా ఖలీఫా
గతంలో ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ ఇలా సినీతారల పేరుతో తిను బండారాలను తయారు చేసి అమ్మే విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సన్నిలీయోన్ మలాయ్ చాప్, బేబీ డోల్ మలాయ్ చాప్, మియా ఖలీఫా మలాయ్ చాప్ ఇలా పేర్లు ఖాతాదారులను కట్టిపడేసేలా పెట్టారు.

దీపిక పదుకోన్ దోశకు డిమాండ్
సన్నిలీయోన్ మలాయ్ చాప్ ఖరీదు రూ.95 కాగా, బేబీ డోల్ మలాయ్ చాప్, మియా ఖలీఫా మలాయ్ చాప్ ఖరీదు కూడా అంతే మొత్తానికి ఖాతాదారులకు లభ్యమవుతాయి. టెక్సాస్‌లో దీపిక దోశకు మంచి డిమాండ్ ఉందట. మీరు పరిసర ప్రాంతాలకు వెళితే దీపికా పదుకోన్ లేదా సన్నిలియోన్‌ను ఎంచక్కా ఆర్డర్ చేసుకోవచ్చు


Click it and Unblock the Notifications











