Deepika Padukone: ఎకానమీ క్లాస్‌లో దీపికా.. ఊహించని విధంగా బాత్రూంలోకి వెళ్తూ.. వీడియో వైరల్!
గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న దీపికా పదుకొనే బయట ఎప్పుడు కనిపించినా కూడా చాలా స్టైలిష్ గా దర్శనమిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె లైఫ్ స్టైల్ కూడా చాలా కాస్ట్లీ గా ఉంటుంది అని చాలాసార్లు రుజువయింది. అయితే ప్రస్తుతం దీపికా పదుకొనేకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఊహించిన విధంగా ఎకానమీ క్లాస్ ఫ్లైట్లో కనిపించింది. ఇక ఆ వీడియో గురించి సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

పఠాన్ తో బిగ్గెస్ట్ హిట్
ఇటీవల దీపిక పదుకొనే పటాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. షారుక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆ విజయంలో ఈ బ్యూటీ మునిగి తేలుతోంది. ఎందుకంటే పఠాన్ సినిమా హిందీలో ఇప్పటికే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఎకానమీ క్లాస్ ఫ్లైట్ లో..
ఇక నిత్యం దేశ విదేశాలు తిరుగుతూ ఉండే దీపిక పదుకొనే ఎక్కువగా అయితే బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇటీవల ఆమె ఊహించిన విధంగా సాధారణ ప్రజలు ప్రయాణించే ఎకానమీ క్లాస్ ఫ్లైట్ లో కనిపించింది. దీంతో ఆమె హఠాత్తుగా అక్కడ కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాత్రూంలోకి వెళుతూ..
బేస్‌బాల్ క్యాప్ తో ఆరెంజ్ ఐవీ పార్క్ జాకెట్ లో ఉన్న ఆమె, విమానం లోపల వాష్‌రూమ్ వైపు వెళుతున్నప్పుడు ఆమె తాను చాలా సింపుల్ అనేలా నడుచుకుంటూ వెళ్లింది. ఇక దీపికా అలా వెళుతూ ఉండగా ఆమెను అందరూ అలానే చూస్తుండిపోయారు. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు బిజినెస్ క్లాస్ లో వెళ్లే దీపిక పదుకొనే ఇలా ఎకానమీ క్లాసులో ఎందుకు వచ్చి ఉంటుంది అని అందరూ ఆశ్చర్యపోయారు.

డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకు మారదో..
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో పై వివిధ రకాల కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి. మేము చాలా సింపుల్ గా ఉంటాము అనుకునే విధంగా దీపిక కొంత బిల్డప్ ఇస్తుంది అని.. కానీ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకు మారదో అర్థం కాదు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అలాగే బహుశా బిజినెస్ క్లాస్ టికెట్లు దొరకకపోయి ఉండవచ్చు అని చివరి నిమిషంలో ఎకానమీ టికెట్లు ఆమె ప్రయాణించి ఉండవచ్చు అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఎంత ట్రోలింగ్ నడిచినా..
ఏదేమైనా మరోసారి దీపిక పదుకొనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటుంది. ఇక ఈమెపై ఎంత ట్రోలింగ్ నడిచినా కూడా రేంజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అంతకుమించి అనేలా బాక్స్ ఆఫీస్ విజయాలను అందుకుంటుంది. ఇప్పటికే పఠాన్ సినిమా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని 1000 కోట్లకు చేరువవుతోంది. అంతేకాకుండా ఈ బ్యూటీ తెలుగులో ప్రభాస్ తో ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











