సీక్రెట్ బయట పెట్టిన దీపిక: రణవీర్‌తో నాలుగేళ్ల క్రితమే జరిగిపోయిందట!
బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ వివాహం నవంబర్ 15,16 తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే. తన చెలికాడు జీవిత భాగస్వామి కావడంతో పెళ్లి తర్వాత దీపిక మరింత ఆనందంగా కనిపిస్తోంది. ఇటీవల ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నాలుగేళ్ల క్రితమే రణవీర్‌తో తన ఎంగేజ్మెంట్ జరిగిందని దీపిక వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఇంతకాలం రహస్యంగా ఉంచినట్లు తెలిపారు. పెళ్లి తర్వాత ఈ సీక్రెట్ బయట పెట్టడంతో అభిమానులు ఆశ్చపోతున్నారు.

2012 నుంచి రిలేషన్లో
2012లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్ లీలా' సినిమాలో కలిసి నటించిన దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. అయితే ఈ ఇద్దరూ చాలా కాలం పాటు తమ రిలేషన్‌షిప్ రహస్యంగానే ఉంచారు.

ఆరేళ్ల రిలేషన్ ఫిప్‌లో అప్స్ అండ్ డౌన్స్
తమ ఆరేళ్ల రిలేషన్ షిప్‌లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయని, బ్రేకప్ అయితే కాలేదని దీపిక పదుకోన్ వెల్లడించారు. గడిచిన ఆరు నెలలు తమ జీవితంలో చాలా సంతోషకమైన రోజులు, ఎమోషనల్‌గా మా రిలేషన్ మరింత బలపడిందని దీపిక తెలిపారు.

నెక్ట్స్ మూవీకి సిద్ధమవుతున్న దీపిక
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘పద్మావత్' సినిమా తర్వాత దీపిక ఏ సినిమాలోనూ నటించలేదు. త్వరలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి 'ఛపాక్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది.

పెళ్లి తర్వాత హిట్ కొట్టిన రణవీర్
దీపికతో పెళ్లి తర్వాత రణవీర్ సింగ్ నటించిన చిత్రం ‘సింబా' నేడు విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు హిట్ చిత్రం ‘టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











