బాల్య స్నేహితులకు షాకిచ్చిన దీపిక పదుకోన్.. లాక్‌డౌన్‌లో ఏం చేశారంటే..
బాలీవుడ్ సెలబ్రిటీలందరూ లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై ఏదో రూపంలో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. షూటింగ్‌లు, ఇతర బిజీ షెడ్యూళ్లతో తమ సన్నిహితులు, స్నేహితులకు దూరంగా ఉన్నవారు వీడియో కాల్స్‌తో వారిని పలకరిస్తున్నారు. తమ మధ్య ఉన్న మధురానుభూతులను మరోసారి నెమరు వేసుకొంటున్నారు. తాజాగా దీపికా పదుకోన్ తన స్నేహితులకు కాల్ చేసి షాకిచ్చారు.
ఇటీవల తన బాల్య స్నేహితులు దివ్య నారాయణ్, స్నేహ రామచంద్రన్‌కు షాకిచ్చారు. వారికి ఫోన్ చేసి ఆశ్చర్యపరిచారు. ఎప్పుడూ బీజీగా ఉండే దీపికా ఫోన్ చేసి మాట్లాడటంతో ఆనందంలో మునిగిపోయారు. చిన్ననాటి ముచ్చట్లు, అనుభూతులను ఈ సందర్భంగా పంచుకొన్నారు. దివ్య నారాయణ్, స్నేహ రామచంద్రన్‌తో వీడియో కాలింగ్‌తో మాట్లాడిన విషయాలను, వారి ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో పంచుకొన్నారు. వారు ఏ రేంజ్‌లో ఆ క్వాలిటీ సమయాన్ని ఎంజాయ్ చేశారో ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది.

తన స్నేహితుల ఫోటోలను పోస్ట్ చేసి.. ఎన్నటీకి తరగని బంధం స్నేహం అంటూ ఓ లవ్ సింబల్ పెట్టి ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దివ్య నారాయణ్, స్నేహ రామచంద్రన్ ఇద్దరికి ట్యాగ్ చేశారు.
View this post on Instagram❤️ #forever @divya_narayan4 @sneha_ramachander
A post shared by Deepika Padukone (@deepikapadukone) on
ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌లో భర్త రణ్‌వీర్ సింగ్‌తో సమయాన్ని చిలిపి పనులతో వెళ్లదీస్తున్నారు. ఒకరిని మరొకరు టీజ్ చేసుకొంటూ సరదాగా గడుపుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో పక్కాగా గృహిణిగా మారిపోయి ఇంటిని శుభ్రం చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











