»   »  ప్రియాంకను వెనక్కి నెట్టేసిన దీపిక పదుకోన్....ఇపుడు ఈవిడే రారాణి!

ప్రియాంకను వెనక్కి నెట్టేసిన దీపిక పదుకోన్....ఇపుడు ఈవిడే రారాణి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియాలో ఇపుడంతా ఇన్‌స్టాగ్రామ్ హవా నడుస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ కంటే ఇపుడు యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో సినీ తారలు కూడా ఇన్‌స్టాలో అభిమానుల ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలో దినదినాభిృద్ది చెందుతున్న ఇన్‌స్టాగ్రామ్ సంస్థ తొలిసారిగా ఇండియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవారికి అవార్డ్స్ ప్రకటించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 22.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ 'మోస్ట్ ఫాలోవ్డ్ అకౌంట్' అవార్డును గెలుచుకుంది. ఈ ఫీట్ సాధించడంపై దీపిక పదుకోన్ స్పందిస్తూ... అభిమానులు, నన్ను ఇష్టపడే వారితో ఎప్పుడూ కనెక్ట్ అయిఉండటం నాకు ఎంతో ముఖ్యం. ఈ అవార్డు గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు.

Deepika Padukone had 22.4 million followers on Instagram

22 మిలియన్ ఫాలోవర్లతో ప్రియాంక చోప్రా తర్వాతి స్థానంలో ఉన్నారు. 20.8 మిలియన్ ఫాలోవర్లతో అలియా భట్ మూడో స్థానంలో ఉంది. ఈ ముగ్గురు 2017లో అత్యధిక ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు.

ధడక్ స్టార్ ఇషాన్ ఖట్టర్ ఇండియాస్ 'ఎమెర్జింగ్ అకౌంట్' అవార్డ్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 'మోస్ట్ ఎంగేజ్డ్ అకౌంట్' అవార్డు దక్కించుకున్నారు. కోహ్లికి ఇన్‌స్టాలో 19.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

English summary
Deepika Padukone has emerged as the most followed Indian celeb on Instagram. The photo-sharing app, which, for the first time announced the Instagram Awards in India, declared the 'Padmaavat' star as the winner of the 'Most Followed Account' title with 22.4 million followers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X