For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫొటోలు లీక్: భర్తకు తెలియకుండా మాజీ లవర్‌ను కలిసిన దీపిక.. అందుకే కలిశారంటూ..

  |

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంలో, అభినయంలో తనదైన శైలిని ఏర్పరచుకుని దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఒక వైపు సినిమాలు.. మరోవైపు యండార్స్‌మెంట్లతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బాలీవుడ్ భామ.. తాజాగా చేసిన పనికి బీ టౌన్ మొత్తం షాక్ అయిపోతుంది.

  రణ్‌వీర్‌తో వివాహం

  రణ్‌వీర్‌తో వివాహం

  దీపిక పదుకొనే.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు కొద్దిరోజుల పాటు ప్రేమాయణ సాగించిన ఈ జంట.. అగ్ని సాక్షిగా ఒక్కటైంది. డెస్టినేష‌న్ ప‌ద్ద‌తిలో వీరి వివాహం జ‌ర‌గ‌గా, రిసెప్ష‌న్ మూడు చోట్ల ఘ‌నంగా జ‌రిగింది. వీరి వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు, ఇతర సెలెబ్రిటీలు హాజరయ్యారు.

  రణ్‌బీర్‌తో ప్రేమాయణం

  రణ్‌బీర్‌తో ప్రేమాయణం

  దీపికా ప‌దుకొనే కొన్నాళ్ళు చాక్లెట్ బాయ్ ర‌ణ‌బీర్ క‌పూర్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట గురించి దేశ వ్యాప్తంగా తెలిసిపోయింది. ఇద్దరూ కలిసి ఎన్నో సార్లు మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని రీతిలో దీపిక అతడికి బ్రేకప్ చెప్పేసింది.

  లైంగికంగా వేధించాడు, ఆ దర్శకుడితో సినిమా చేయడంపై దీపిక పదుకోన్‌‌పై విమర్శలు!

  మాజీ లవర్ గుర్తు అలాగే ఉంచుకుని..

  మాజీ లవర్ గుర్తు అలాగే ఉంచుకుని..

  రణ్‌బీర్‌కు బ్రేకప్ చెప్పి, రణ్‌వీర్‌తో ప్రేమాయణం సాగించింది దీపిక. వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లింది. అయితే, ఆమె మాత్రం మాజీ లవర్ గుర్తులను మాత్రం అలాగే ఉంచుకుంది. వీరి ప్రేమ‌కి గుర్తుగా దీపికా త‌న మెడ‌పై ఆర్కే ( ర‌ణ‌బీర్ క‌పూర్‌) అనే టాటూ వేయించుకుంది. వీరి మ‌ధ్య రిలేష‌న్‌కి బ్రేక్ ప‌డ‌డంతో ఆ టాటూని చెరిపేసేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించిన అది కుద‌ర‌లేదు.

  ఇప్పుడు అతడిని రహస్యంగా కలిసింది

  విడిపోయిన తర్వాత రణ్‌బీర్‌ను దీపిక కలిసింది. అది కూడా రహస్యంగా కావడంతో బీ టౌన్‌లో ఈ జంట మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. వీరి కలయిక గురించి బాలీవుడ్‌కు చెందిన పలు పత్రికలు, వెబ్‌సైట్లు కథనాలు రాశాయి. అంతేకాదు, వీళ్లిద్దరూ కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  సినిమా కోసమంటూ వివరణ

  సినిమా కోసమంటూ వివరణ

  దీపికా ప‌దుకొనే, ర‌ణ‌బీర్ క‌పూర్‌ కలిసింది సినిమా కోసమని ఓ వర్గం చెబుతోంది. అజయ్ దేవ్‌గణ్ - లువ్ రాజన్ కాంబినేషన్‌లో వస్తున్న థ్రిల్లర్ మూవీ కోసమే దీపిక.. రణ్‌బీర్‌ను కలిసిందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో చాక్లెట్ బాయ్ సరసన దీపికను నటింపజేసేందుకు చిత్ర యూనిట్ అక్కడకు పిలిచిందని కొందరు అంటున్నారు.

  భర్తకు తెలియదంటున్న మరో వర్గం

  భర్తకు తెలియదంటున్న మరో వర్గం

  దీపికా ప‌దుకొనే, ర‌ణ‌బీర్ క‌పూర్‌ను కలిసిన విషయం ఆమె భర్త రణ్‌వీర్ సింగ్‌కు తెలియదనే టాక్ వినిపిస్తోంది. వాళ్లిద్దరూ ప్రేమించుకున్న విషయం తెలిసినా ఆమెను పెళ్లి చేసుకున్న రణ్‌వీర్.. పాత లవర్‌ను కలవద్దని చెప్పాడని బీ టౌన్‌లో ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు మాత్రం దీపిక.. అతడిని కలవడం చర్చనీయాంశం అవుతోంది.

  English summary
  Bollywood Star Heroine Deepika and Young Hero Ranbir fans were excited to see them together on screen but there have been no official confirmations about the same. It looks like the rumours will soon turn out to be true.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X